నేడు పత్తికొండలోకి నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ యువగళం పాదయాత్ర నేడు పత్తికొండ నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ యువగళం పాదయాత్ర నేడు పత్తికొండ నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. ఇప్పటి వరకూ లోకేష్ 902.9 కిలోమీటర్ల మేర నడిచారు. 71వ రోజు యువగళం పాదయాత్ర కొనసాగుతుంది. ఉదయం ఏడుగంటలకు పొలిమేరమెట్ట బస నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. 7.30 గంటలకు యర్రగుంటపల్లి క్రాస్ వద్ద చేనేతలతో లోకేష్ సమావేశమయ్యారు. 7.55 గంటలకు కలచర్లలో స్థానికులతో భేటీ అయ్యారు. 9.35 గంటలకు ఎస్.రంగాపురం వద్ద ఎన్టీఆర్ హౌసింగ్ బాధితులతో లోకేష్ సమావేశమవుతారు.
బహిరంగ సభ....
ఉదయం 10.30 గంటలకు పాదయాత్ర పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. 11.05 గంటలకుక శభాష్ పురం వద్ద స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో లోకేష్ పాల్గొంటారు. 12 గంటలకు పెద్దకొండ వద్ద భోజన విరామానికి ఆగుతారు. సాయంత్రం 3గంటలకు పెద్దకొండ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3.45 గంటలకు గుడిసె గుప్పరాలలో సర్పంచ్ లతో జరిగే సమావేశంలో లోకేష్ పాల్గొంటారు. సాయంత్రం నాలుగు గంటలకు డిసి కొండ క్రాస్ వద్ద స్థానికులతో సమావేశమవుతారు. ఐదు గంటలకు రాంపల్లి సర్కిల్ వద్ద బహిరంగసభలో లోకేష్ ప్రసంగించనున్నారు. రాత్రికి రాంపల్లి శివార్లలో బస చేయనున్నారు.