యువగళం @ 900 కి.మీ
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 70వరోజుకు చేరుకుంది
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 70వరోజుకు చేరుకుంది. నేడు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో జరుగుతుంది. ఇప్పటి వరకూ లోకేష్ 889.7 కిలోమీటర్ల దూరం నడిచారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర గుడిపాడులో స్థానికులతో మాట్లాడారు. అనంతరం 8.30 గంటలకు హెచ్ ఆర్ పల్లిలో యాదవ సామాజికవర్గం ప్రజలతో సమావేశమై వారి సమస్యలపై చర్చిస్తారు. తర్వాత పూదొడ్డి, మందొడ్డి క్రాస్ వద్ద మామిడి రైతులతో లోకేష్ భేటీ కానున్నారు.
బహిరంగ సభలో...
ఉదయం పదకొండు గంటలకు ప్యాపిలి శివార్లలో భోజన విరామానికి ఆగుతారు. సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభమవుతుంది. ప్యాపిలి నీలకంఠేశ్వరస్వామి గుడి వద్ద స్థానికులతో లోకేష్ సమావేశమవుతారు. అనంతరం 4.55 గంటలకకు ప్యాపిలి బీసీ కాలనీలో 900 కిలోమీటర్లను పూర్తి చేసిన సందర్భంగా మైలురాయిని లోకేష్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ప్యాపిలిలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం పొలిమేరమెట్ట విడిదిలో రాత్రికి బస చేయనున్నారు.