ఆలూరులో ఎక్కువ రోజులు ఎందుకంటే?
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ఆలూరు నియోజకవర్గంలో కొనసాగుతుంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ఆలూరు నియోజకవర్గంలో కొనసాగుతుంది. నేటికి 75వ రోజుకు యువగళం పాదయాత్ర చేరుకుంది. ఈరోజు ఉదయం ఏడు గంటలకు వలగొండ బస నుంచి పాదయాత్ర ప్రారంభమయింది. 7.30 గంటలకు వలగొండలో స్థానికులతో లోకేష్ సమావేశమయ్యారు. ఉదయం 8.25 గంటలకు పుప్పుల దొడ్డిలో యాదవ సామాజికవర్గం ప్రజలతో భేటీ అయి వారి సమస్యలపై చర్చించున్నారు. 9.35 గంటలకు కైరుప్పలలో స్థానికులతో లోకేష్ సమావేశం కానున్నారు.
వరస కార్యక్రమాలతో...
ఉదయం 10.45 గంటలకు వెంగళదొడ్డి క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో లోకేష్ పాల్గొంటారు. ఉదయం 11.50 గంటలకు కారుమంచి శివార్లలో బీసీ సామాజికవర్గీయులతో ముఖాముఖి కార్కక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.50 గంటలకు కారుమంచి శివార్లలో భోజన విరామానికి ఆగుతారు. సాయంత్రం నాలుగు గంటలకు పాదయాత్ర ప్రారంభించి కారుమంచి శివార్ల నుంచి పాదయాత్ర కొనసాగిస్తారు. సాయంత్రం 4.20 గంటలకు కారుమంచిలో అస్పరి మండల ప్రజలతో సమావేశమవుతారు. సాయంత్రం ఆరు గంటలకు ములిగుండంలో స్థానికులతో సమావేశమయిన తర్వాత అక్కడే రాత్రికి బస చేస్తారు. ఆలూరు నియోజకవర్గంలో ఎక్కువ రోజుల పాటు లోకేష్ పాదయాత్ర చేసినట్లవుతుంది.