యువగళం @ 1300 కిమీ
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు 1300 కిలోమీటర్లకు చేరుకోనుంది
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు 1300 కిలోమీటర్లకు చేరుకోనుంది. నేడు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో జరగనుంది. ఇప్పటి వరకూ లోకేష్ 1301 కిలోమీటర్ల మేర నడిచారు. ఈరోజు లోకేష్ పాదయాత్ర 103వ రోజుకు చేరుకుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు నంద్యాల యాతం ఫంక్షన్ హాలు వద్ద రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో లోకేష్ పాల్గొంటారు. దాదాపు రెండు గంటల పాటు రైతులతో సమావేశమై వారి సమస్యలపై చర్చిచంనున్నారు.
నంద్యాల నియోజకవర్గంలో...
సాయంత్రం 4 గంటలకు నంద్యాల యాతం ఫంక్షన్ హాలు వద్ద 1,300 కి.మీ. మైలురాయి ఆవిష్కరణను చేయనున్నారు. 4.45 గంటలకు కానాలలో జాతీయరహదారి విస్తరణ బాధితులతో సమావేశం అవుతారు. 5.45 గంటలకు హెచ్ఎస్ కొట్టాలలో స్థానికులతో సమావేశం అవుతారు. 6.20 గంటలకు ఎం.చిన్నకొట్టాలలో స్థానికులతో సమావేశమై వారి సమస్యలపై చర్చిస్తారు. 6.55 గంటలకు జూలపల్లిలో వడ్డెర సామాజికవర్గీయులతో సమావేశం కానున్నారు. 7.45 గంటలకు పసరుపాడులో స్థానికులతో సమావేశం. రాత్రి 10.05 గంటలకు రాయపాడులో స్థానికులతో సమావేశం అవుతారు. 10.55 గంటలకు రాయపాడు శివారులో లోకేష్ బస చేయనున్నారు.