TTD: వీటిని వేలం వేయనున్న టీటీడీ.. త్వరపడండి!!
భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను నవంబరు 4 నుండి 11వ తేదీ వరకు
తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను నవంబరు 4 నుండి 11వ తేదీ వరకు ఈ – వేలం ( ఆన్ లైన్ లో) వేయనున్నారు. కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 358 లాట్లు ఉన్నాయి. ఇందులో ఆర్ట్ సిల్క్/ పాలిస్టర్ దోతీలు, ఉత్తరీయాలు, ఆర్ట్ సిల్క్/ పాలిస్టర్ /నైలాన్ /నైలెక్స్ చీరలు, ఆఫ్ చీరలు, క్లాత్ బిట్స్, బ్లౌజ్‌పీస్‌లు, ఉత్తరీయాలు, టర్కీ టవళ్లు, లుంగీలు, శాలువలు, బెడ్‌షీట్లు, హుండీ గల్లేబులు, దిండుకవర్లు, పంజాబి డ్రెస్ మెటీరియల్స్, జంకాళం కార్పెట్లు, దుప్పట్లు, కర్టన్లు, గర్భగృహ కురాళాలు, బంగారువాకిలి పరదాలు, శ్రీవారి గొడుగులు ఉన్నాయి.
ఇక భక్తులు కానుకగా సమర్పించిన బియ్యంను నవంబరు 7వ తేదీన టెండర్, వేలం వేయనున్నారు. ఇందులో మిక్సిడ్ బియ్యం 13,880 కేజిలు టెండర్, వేలంలో ఉంచనున్నారు. ఆసక్తి గలవారు నవంబరు 7వ తేదీలోపు ”కార్యనిర్వహణాధికారి, టీటీడీ” పేరిట రూ. 25,000/- ఈఎండి, సీల్డ్ టెండర్‌తో పాటు తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం, జనరల్ మేనేజర్(వేలం) కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అదేరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు టెండర్లను తెరవడం జరుగుతుంది.
ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429, నంబర్లలో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్‌సైట్ www.tirumala.org సంప్రదించాల్సి ఉంటుంది.