తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తున్నా తిరుమలకు మాత్రం భక్తుల రాక ఆగడం లేదు.
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తున్నా తిరుమలకు మాత్రం భక్తుల రాక ఆగడం లేదు. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తుల రాక ప్రారంభం కావడంతో వచ్చే నాలుగు రోజులు భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
హుండీ ఆదాయం..
నిన్న తిరుమల శ్రీవారిని 74,212 మంది భక్తులు దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. 33,215 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 5.05 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.