Tirumala : శనివారం తిరుమలలో రద్దీ తగ్గిందేమిటి చెప్మా?

తిరుమలలో భక్తుల రద్దీ శనివారం పెద్దగా లేదు. అయితే దర్శనానికి మాత్రం ఎక్కువ సమయం పడుతుంది.

Update: 2024-08-31 03:09 GMT

తిరుమలలో భక్తుల రద్దీ శనివారం పెద్దగా లేదు. అయితే దర్శనానికి మాత్రం ఎక్కువ సమయం పడుతుంది. శనివారం సహజంగా పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. కానీ బంగాళాఖాతంలో అల్పపీడనంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికతో ముందుగా తిరుమల ట్రిప్ కు ప్లాన్ చేసుకున్న భక్తులు రద్దు చేేసుకున్నట్లుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అభిప్రాయపడుతున్నారు. వరసగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడంతో నేడు తిరుమలలో రద్దీ అంతంత మాత్రంగానే ఉంది. గత కొద్ది రోజులుగా రద్దీతో కిటకిటలాడున్న తిరుమల నేడు కొంత రష్ తగ్గడంతో భక్తులు శ్రీవెంకటేశ్వరస్వామికి అత్యంత ప్రియమైన శనివారం స్వామి వారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. అన్నప్రసాదాల క్యాంటిన్ వద్ద కూడా పెద్దగా రష్ లేదు.

పన్నెండు గంటలు...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో పదిహేడు కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఈరోజు ఉదయం ఏడు గంటలకు క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. టైమ్ స్లాట్ భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 65,080 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,394 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.80 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News