క్యూ లైన్ కంపార్ట్‌మెంట్లు దాటి
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వరసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వరసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. మరోవైపు పరీక్ష ఫలితాలు వెలువడుతుండటం, వేసవి సెలవులు కావడంతో రానున్న కాలంలో తిరుమల భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి బయట ఏటీజీహెచ్ వరకూ క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్‌లో ఉన్న భక్తులకు ఐదు గంటలకు సమయం పడుతుందని, నడక దారి వచ్చే భక్తులకు కూడా అంతే సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
24 గంటల సమయం...
సర్వదర్శనం క్యూలైన్‌లో టోకెన్లు లేకుండా ఈ రోజు ఏడు గంటలకు ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 82,582 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 43,526 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.19 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు. రద్దీని చూసి తిరుమల శ్రీవారి దర్శనం టిక్కెట్లు ఉన్న వారే తిరుమలకు రావాలని అధికారులు కోరుతున్నారు.