హుండీ ఆదాయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. వరసగా మూడు రోజులు సెలవులు రావడంతో భక్తుల రద్దీ ఈరోజు కూడా తగ్గలేదు.
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. వరసగా మూడు రోజులు సెలవులు రావడంతో భక్తుల రద్దీ ఈరోజు కూడా తగ్గలేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి భక్తులు బయట ఆళ్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ వరకూ క్యూ లైన్‌లో వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్‌లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. సర్వదర్శనం క్యూ లైన్‌లో ఉదయం ఏడు గంటలకు ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంట సమయం పడుతుందని తెలిపారు.
ప్రత్యేక దర్శనం....
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 85,450 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 43,862 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.21 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.