బోసిపోయిన అరకు లోయ .. వెనక్కు వెళ్లిన పర్యాటకులు

అరకులోయ బోసి పోయింది. బోయ, వాల్మీకిని ఎస్టీ జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గిరిజనులు బంద్‌ చేస్తున్నారు

Update: 2023-03-31 03:48 GMT

అరకులోయలో బంద్ జరుగుతుంది. బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గిరిజనులు బంద్ నిర్వహిస్తున్నారు. దీంతో పర్యాటకులు అరకు లోయకు వచ్చి వెనక్కు వెళ్లిపోతున్నారు. అరకు ప్రాంతంలోని ఏడు మండలాల్లో బంద్ జరుగుతుంది. బోయ, వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిన నేపథ్యంలో ఈ బంద్‌కు పిలుపు నిచ్చాయి.

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ...
ఈ నేపథ్యంలో అరకు ప్రాంతంలో ఆర్టీసీ బస్సులను నిలిపేశారు. ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తమ హక్కులను హరించే విధంగా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ ఆదివాసీలు రోడ్లపైకి రావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News