సీనియర్లున్నా వారిని కాదని....?
ఊహించకుండా మంత్రి పదవిని దక్కించుకున్నారు ఉషశ్రీ చరణ్. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి మాత్రం దక్కింది
ఊహించకుండా మంత్రి పదవిని దక్కించుకున్నారు ఉషశ్రీ చరణ్. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి మాత్రం దక్కింది కేవలం సామాజికవర్గం కోటాలోనే. కర్ణాటక చెందిన ఉషశ్రీ చరణ్ రాయదుర్గంలో స్థిరపడ్డారు. 2012లో టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2013లో వైసీపీలో చేరి కల్యాణదుర్గం ఇన్ చార్జిగా నియమితులయ్యారు. 2019 ఎన్నికల్లో కల్యాణదుర్గం నుంచి గెలిచిన ఆమెను సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. కురుబ సామాజికవర్గానికి చెందిన ఉషశ్రీ చరణ్ కు జగన్ తన మంత్రివర్గంలో కన్పించారు. మంచి వాగ్దాటి ఉన్న ఉషశ్రీ చరణ‌్ ను జగన్ మంత్రిగా ఎంపిక చేశారు. అనంతపురంలో అనేక మంది సీనియర్లున్నా ఉషశ్రీ చరణ్ కు మంత్రి పదవి దక్కింది.