Ys Jagan : నేడు తెనాలికి వైఎస్ జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు తాడేపల్లికి రానున్నారు. రాత్రికి తెనాలికి వస్తున్నారు;

Update: 2025-03-17 04:34 GMT
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు తాడేపల్లికి రానున్నారు.
  • whatsapp icon

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు తాడేపల్లికి రానున్నారు. బెంగళూరు నుంచి బయలుదేరి ఆయన విజయవాడకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లి లోని తన ఇంటికి చేరుకోనున్నారు. ఈరోజు రాత్రి ఏడు గంటలకు తెనాలిలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వివాహ వేడుక కార్యక్రమాల్లో జగన్ పాల్గొంటారు.

ముఖ్యనేతలతో సమావేశం...
దీంతో పాటు పార్టీ ముఖ్యనేతలతో జగన్ సమావేశమయ్యే అవకాశముంది. పార్టీలో పరిస్థితులతో పాటు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై జగన్ చర్చించే అవకాశముంది. వైఎస్ జగన్ తెనాలికి వస్తుండటంతో పెద్దయెత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు తరలి వచ్చే అవకాశముండటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News