TDP : అధికారంలోకి రాగానే దానిపై ఖచ్చితంగా సమీక్షిస్తాం

ఆరోగ్య శ్రీ బకాయిలపై వైసీపీ ప్రభుత్వం స్పందించడంలేదని దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శించారు

Update: 2024-05-21 13:13 GMT

ఆరోగ్య శ్రీ బకాయిలపై వైసీపీ ప్రభుత్వం స్పందించడంలేదని దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దాదాపు పదిహేను నెలలుగా ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఒప్పందం ప్రకారం 45 రోజుల్లో బిల్లులు చెల్లించాలని, బిల్లులు రాకపోవడంతో ఆరోగ్య శ్రీ సేవలను ఆసుపత్రులు నిలిపేశాయన్నారు. బకాయిలు చెల్లించాలని ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఆసుపత్రులకు డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడంపై పేదల ఆరోగ్యం పట్ల జగన్ కు ఉన్న చిత్త శుద్ధి ఏంటో అర్థం అవుతుందని దేవినేని ఉమ అన్నారు.

ఆరోగ్యానికి పెద్దపీట వేసి...
చంద్రబాబు పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేశారని, ఎన్టీఆర్ వైద్యం సేవ పథకం కింద నిధుల్లో 45 శాతం రోగికి ఆసుపత్రి ఖర్చులకు ఇచ్చేవాళ్లమని తెలిపారు. 35 శాతం సర్జరీలకు డాక్టర్లకు ప్రోత్సహకంగా ఇచ్చేవాళ్లమని, 25 శాతం ఖాతాల్లో ఉంచి అవసరాలను బట్టి బోధన ఆసుపత్రులకు కేటాయించి పేదల ఆరోగ్యాన్ని కాపడటానికి చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు. ఓట్లు దండుకోవడానికి డాక్టర్లను వాడుకుని గ్రామాలకు పంపి ప్రచారం చేయించారన్న దేవినేని ఉమ తాము అధికారంలోకి రాగానే వీటిపైన సమీక్షిస్తామని, తప్పకుండా చర్యలు ఉంటాయని అన్నారు. పర్సంటేజీల కోసం మీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎవరెవరికి ఏం చేశారో అవి అన్నీ బట్టబయలు అవుతాయని అన్నారు.


Tags:    

Similar News