Pinnelli : పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటీషన్లపై నేడు తీర్పు

వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌లపై నేడు తీర్పు వెలువడనుంది

Update: 2024-05-28 01:52 GMT

వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌లపై నేడు తీర్పు వెలువడనుంది. తనపై దాఖలయిన హత్యాయత్నం కేసులలో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పిన్నెల్లికి మధ్యంతర బెయిల్ ఇవ్వవద్దంటూ ఫిర్యాదుదారులు నంబూరి శేషగిరిరావు, చెరుకూరి నాగశిరోమణి తరుపున పోసాని వెంకటేశ్వర్లు నిన్న హైకోర్టులో తమ వాదనలు వినిపించారు. అతను బయట ఉంటే ప్రమాదకరమని తెలిపారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తి కౌంటింగ్ రోజు అనుమతించడం సరికాదని వాదించారు.

బెయిల్ ఇవ్వవద్దంటూ...
ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో సాక్షులను కూడా బెదిరించే అవకాశముందని తెలిపారు. తమపైనే కాకుండా పోలీసు అధికారులపై కూడా హత్యాయత్నం చేశారని వాదించారు. అయితే ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి జూన్ 6వ తేదీ వరకూ మధ్యంతర బెయిల్ ఇచ్చారని ఆయన తరుపున న్యాయవాది వాదించారు. రెండు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. నేడు ఉత్తర్వులు జారీ చేయనున్నారు.


Tags:    

Similar News