YSRCP : అనిల్.. అంబటి.. దీ ఒకటే వాయిస్.. ఇక అంతేనా?
వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు విడివిడిగా మీడియా సమావేశాలు పెట్టారు
నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు విడివిడిగా మీడియా సమావేశాలు పెట్టారు. అయితే ఇద్దరిదీ ఒకటే వాయిస్. పోలీసులు తమకు సహకరించలేదని. టీడీపీ అభ్యర్థులను స్వేచ్ఛగా వదిలేసిన పోలీసులు తమను మాత్రం ఆంక్షలతో అడ్డుకున్నారని అన్నారు. అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ నరసరావుపేట, మాచర్ల, గురజాలలో టీడీపీ నేతలు వైసీపీ క్యాడర్ పై దాడులకు దిగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని అన్నారు.
సత్తెనపల్లిలోనూ...
సత్తెనపల్లిలోనూ అంబటి రాంబాబు మాట్లాడుతూ కన్నా లక్ష్మీనారాయణను, ఆయన కుమారుడిని వదిలేసిన పోలీసులు తమను మాత్రం అడుగడుగునా అడ్డుకున్నారన్నారు. పోలీస్ అధికారులను మార్చి తమకు అన్ని రకాలుగా ఆటంకాలు ఏర్పరిచిందన్నారు. టీడీపీ నేతలు దాడులకు దిగుతున్నా వారిని నిలువరించడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. ఎన్నికల ముఖ్యఅధికారి కూడా రీపోలింగ్ అవసరం లేదని అంటున్నారని, తాము ఆరు చోట్ల రీపోలింగ్ చేయాలని కోరుతున్నామని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.