Ys Jagan : విశాఖ బాధితులకు ఎనభై శాతం పరిహారం... జగన్ ఆదేశం
వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. విశాఖ హార్బర్ ఘటనలో నష్టపోయిన మత్స్యకారులకు భారీ సాయాన్ని ప్రకటించింది;

andhra pradesh
వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. విశాఖ హార్బర్ ఘటనలో నష్టపోయిన మత్స్యకారులకు భారీ సాయాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న విశాఖ హార్బర్ వద్ద అగ్నిప్రమాదం జరిగి దాదాపు నలభై బోట్లు వరకూ అగ్నికి ఆహుతి అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
80 శాతం సాయాన్ని...
జగన్ ప్రభుత్వం మాత్రం ఈ ప్రమాదంలో నష్టపోయిన వారి కుటుంబాలకు ఎనభై శాతం నష్టపరిహారాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటికే మత్యకారులను మంత్రి సీదిరి అప్పలరాజు పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ సాయాన్ని ప్రకటించింది.