YS Jagan: వైఎస్ జగన్ ఎంపీగా పోటీ చేస్తారని ఎలా అనుకున్నారు?

గత కొద్దిరోజులుగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా రాజీనామా

Update: 2024-07-11 05:26 GMT

గత కొద్దిరోజులుగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా రాజీనామా చేయబోతున్నారని ప్రచారం చేస్తున్నారు. ఆయన ఎంపీగా పోటీ చేసి కేంద్రంలో చక్రం తిప్పాలని అనుకుంటున్నారని కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రచారం చేశాయి. వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే వైసీపీ క్యాడర్ దెబ్బతింటుందనే భయం కూడా మొదలైంది. అయితే దీనిపై ఇప్పటి వరకూ వైసీపీ నుండి ఎలాంటి ప్రకటన కూడా రాలేదు.

తాజాగా సీఎం జగన్ రాజీనామా చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. అసత్య ప్రచారంపై మండిపడ్డారు. అనవసర దుష్ప్రచారం చేస్తున్నారని.. జగన్ రాజీనామా చేయరని తేల్చి చెప్పారన్నారు. వైఎస్ జగన్ కు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం గత ప్రభుత్వంపై నిందలు మోపుతోందన్నారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా కావాల్సిందేనని సుబ్బారెడ్డి చెప్పారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాలే ఉన్నాయి కాబట్టి విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి నిధులు రాబట్టాలని డిమాండ్ చేశారు. విభజన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు.


Tags:    

Similar News