పథ్నాలుగు మంది చనిపోతే పట్టించుకోరా? జగన్ ఫైర్

విజయనగరం జిల్లాలో గొర్ల గ్రామంలో పథ్నాలుగు మంది చనిపోవడం దురదృష్టకరమని వైఎస్ జగన్ అన్నారు

Update: 2024-10-24 07:32 GMT

విజయనగరం జిల్లాలో గొర్ల గ్రామంలో పథ్నాలుగు మంది చనిపోవడం దురదృష్టకరమని వైఎస్ జగన్ అన్నారు. గొర్ల గ్రామంలో పర్యటించి బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ తాను ట్వీట్ చేసిన తర్వాతనే ప్రభుత్వం ఈ గ్రామంలో చర్యలు ప్రారంభించిందని తెలిపారు. ఎవరూ చనిపోలేదనే చెప్పించే ప్రయత్నం చేశారని జగన్ ఆరోపించారు. చంపా నదిలో నుంచి వచ్చే నీళ్లు కలుషితమైన నీటిని అరికట్టలేక పోయిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం దానిని పట్టించుకోలేదని జగన్ అన్నారు.

తొలి కేసు నెలరోజుల క్రితం
వాటర్ స్కీమ్ మెయిన్‌టెయినెన్స్ కూడా గత రెండు నెలల నుంచి కూడా చేయలేదని జగన్ అన్నారు. అందువల్లనే గొర్ల గ్రామంలో ఇన్ని మరణాలు సంభవించాయని తెలిపారు. 35 రోజుల క్రితం తొలి కేసు నమోదయినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఫైర్ అయ్యారు. దాదాపు డయేరియాతో బాధపడుతూ ఇప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 62 మంది చికిత్స పొందుతున్నారని, ప్రయివేటు ఆసుపత్రుల్లో ఎంత మంది ఉన్నారో కూడా తెలియదని జగన్ అన్నారు. ఎందుకు విశాఖకు తరలించి చికిత్స అందించలేదని ఆయన ప్రశ్నించారు.


Tags:    

Similar News