మంత్రి పెద్దిరెడ్డికి షాక్.. కాన్వాయ్ పై చెప్పులతో దాడి

44వ జాతీయ రహదారిపై శ్రీకృష్ణ దేవరాయల కూడలిలో మంత్రికి ఫిర్యాదు చేసేందుకు పెద్దఎత్తున అసమ్మతి నేతలు..;

Update: 2022-12-17 07:57 GMT
minister peddireddy ramachandrareddy, asammathi sega

minister peddireddy ramachandrareddy

  • whatsapp icon

మంత్రి పెద్దిరెడ్డికి ఊహించని షాక్ తగిలింది. శ్రీ సత్యసాయిజిల్లా పెనుకొండలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా వెళ్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్ ని ఆ పార్టీ అసమ్మతి నేతలు అడ్డుకున్నారు. మంత్రి కాన్వాయ్ కి చెప్పులు చూపించి దాడి చేశారు. సొంత పార్టీ నేతల నుండి అసమ్మతి వైఖరిని చూసి మంత్రి పెద్దిరెడ్డి షాకయ్యారు.

44వ జాతీయ రహదారిపై శ్రీకృష్ణ దేవరాయల కూడలిలో మంత్రికి ఫిర్యాదు చేసేందుకు పెద్దఎత్తున అసమ్మతి నేతలు గుమిగూడారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మద్దతుదారులు అక్కడికి చేరుకోగా.. ఇరువర్గాల మధ్య వాగ్యుద్ధం జరిగింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి.. పరిస్థితిని అదుపుచేశారు. మంత్రి కాన్వాయ్ రాగానే.. చెప్పులతో అసమ్మతి నేతలు విరుచుకుపడటంతో.. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చేసేది లేక మంత్రి పెద్దిరెడ్డి అక్కడి నుండి వెళ్లిపోయారు.


Tags:    

Similar News