రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స.. మోడీ సర్కార్ అద్భుతమైన స్కీమ్‌

కేంద్రంలోని మోడీ సర్కార్‌ దేశ ప్రజల కోసం వివిధ రకాల పథకాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా రైతులకు ఆర్థికంగా ఎదిగేందుకు..

Update: 2023-08-17 05:09 GMT

కేంద్రంలోని మోడీ సర్కార్‌ దేశ ప్రజల కోసం వివిధ రకాల పథకాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా రైతులకు ఆర్థికంగా ఎదిగేందుకు చేపడుతున్న పథకాలతో పాటు ప్రజల ఆరోగ్యంపై కూడా దృష్టి సారిస్తోంది. ఏదైనా జబ్బు చేస్తే ఆస్పత్రుల చుట్టు తిరుగుతూ ఖర్చు చేసుకునే స్థోమత చాలా మందికి ఉండదు. అలాంటి విషయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహిస్తూ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ విషయంలో అనేక పథకాలను అమలు చేస్తోంది కేంద్రం. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లినట్లయితే భారీగా డబ్బులు ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. డబ్బులున్నవారు సరే లేని వారి పరిస్థితి ఏమిటి? ఇలాంటి సమయంలో మోడీ సర్కార్ దేశంలోని ప్రతి వర్గానికి మెరుగైన ఆరోగ్య సౌకర్యాలను అందించడానికి ప్రధాన మంత్రి జన్-ఆరోగ్య యోజన అంటే ఆయుష్మాన్ భారత్ యోజనను ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం. దీని ద్వారా కోట్లాది మంది సామాన్య ప్రజలు లబ్ది పొందుతున్నారు. ఈ పథకం ద్వారా రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్సను పొందేందుకు అవకాశం ఉంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని సెప్టెంబర్ 23, 2018న ప్రారంభించింది. మీరు కూడా ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలనుకుంటే సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. మరి పథకం పొందేందుకు ఎలాంటి వారు అర్హులు..? దరఖాస్తు చేసుకోవడం విధానం ఎలానో తెలుసుకుందాం.

ఆయుష్మాన్ భారత్ పథకానికి అర్హత:

ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే పేద, బలహీన ఆదాయ వర్గాలకు చెందిన వారి కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, నిరుపేదలు, కార్మికులు మొదలైనవారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీరు మీ అర్హతను తనిఖీ చేయాలనుకుంటే PMJAY అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌ లాగిన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ స్కీమ్‌ కింద లబ్ధిదారులకు దేశంలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స సదుపాయం పొందవచ్చు. ఆసుపత్రిలో చేరిన తర్వాత కూడా వచ్చే 15 రోజులకు అయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో కుటుంబ సభ్యులందరూ వారి వయస్సు, తదితర వివరాలు అవసరం. ఇందులో ఆయుష్మాన్ యోజన పూర్తిగా నగదు రహిత పథకం కాబట్టి మీరు ఒక్క రూపాయి కూడా నగదుగా చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆస్పత్రిలో చికిత్స పొందవచ్చు.

దరఖాస్తు చేసుకునే సమయంలో కావాల్సిన పత్రాలు:

  • ఆధార్ కార్డు
  • రేషన్ కార్డు
  • మొబైల్ నంబర్
  • ఆదాయ ధృవీకరణ పత్రం
  • కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)
  • పాస్‌ పోర్ట్‌ సైజు ఫోటో

దరఖాస్తు చేసుకోవడం ఎలా?

  • పథకం కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
  • ఆయుష్మాన్ భారత్ పథకం కోసం దరఖాస్తు చేయడానికి ముందుగా దాని అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • కొత్త రిజిస్ట్రేషన్ కోసం, ‘కొత్త రిజిస్ట్రేషన్’ లేదా ‘వర్తించు’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • దీని తర్వాత మీరు మీ పేరు, లింగం, ఆధార్ నంబర్, రేషన్ కార్డు మొదలైన వాటి సమాచారాన్ని నమోదు చేయాలి.
  • మీరు నమోదు చేసే ఏ సమాచారం అయినా సరైనదేనని గుర్తుంచుకోండి. క్రాస్ చెక్ చేయండి.
  • అడిగిన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి.
  • మొత్తం దరఖాస్తు ఫారమ్‌ను ఒకసారి తనిఖీ చేసి, ఆపై దానిని సమర్పించండి.
  • దరఖాస్తు సమర్పించిన తర్వాత, అధికారులు మీ దరఖాస్తును సమీక్షిస్తారు.
  • దీని తర్వాత మీరు ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య కార్డును సులభంగా పొందుతారు.

Tags:    

Similar News