Gold Price Today : గుడ్ న్యూస్ బంగారం ధరలు భారీగా తగ్గాయ్.. ఎంతో తెలుసా?
దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి.
దేశంలో బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి. కానీ అదే సమయంలో కొన్ని సార్లు తగ్గుతుంటాయి. అయితే ఎక్కువ సార్లు ధరలు పెరగడమే మనం చూస్తుంటాం. ఇటీవల కాలంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. వెండి ధరలు కూడా అంతే. పది గ్రాముల బంగారం ధర ఎనభై వేల రూపాయలు దాటగా, కిలో వెండి ధర లక్ష రూపాయలకు పై చిలుకే పలుకుతుంది. దీంతో కొనుగోళ్లు కూడా తగ్గాయి. కొనాలనుకునే వారు కూడా ధరలను చూసి వెనక్కు తగ్గారు. ఇంత ధరలను పెట్టి కొనుగోలు చేయడం అనవసరం అని భావించి తమ కొనుగోలు ఆలోచనకు వారు ఫుల్ స్టాప్ పెట్టేశారు. దీంతో అమ్మకాలు పడిపోయాయి.
కొనుగోళ్లుతగ్గి...
చివరకు దీపావళి పండగ, థన్ తెరాస్ రోజు కూడా బంగారం ధరలు పెరగడంతో అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. దీంతో వ్యాపారులు డీలా పడ్డారు. కొనుగోలు దారులను ఆకట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇంత బంగారం కొంటే ఇంత వెండి ఫ్రీ అంటూ భారీగా ఆఫర్లు ప్రకటించినా వినియోగదారులు ఎవరూ అటు వైపు చూడటం లేదు. ఇక బంగారం దుకాణాల యాజమాన్యాలు కొత్త కొత్త డిజైన్లతో రూపొందించినా అవి దుకాణాల్లోనే మిగిలిపోయాయి. అనేక కారణాలతో బంగారం ధరలు పెరిగాయని, ఇంకా పెరుగుతాయన్న అంచనాలతో పసిడి కొనుగోలుకు ఎవరూ మొగ్గు చూపడం లేదు.
అమెరికా ఎన్నికల ఫలితాల తర్వాత...
అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత బంగారం ధరల్లో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో డాలర్ మరింత పరుగులు పెట్టింది. మదుపరులు కూడా అటువైపు మళ్లారు. దీంతో దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై 1,650 రూపాయలు తగ్గింది. కిలో వెిండి ధరపై మూడు వేల రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,000 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 78,560 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,02,000 రూపాయలకు చేరుకుంది.