దిగొచ్చిన బంగారం ధర... ఇప్పుడే కొనేసేయండి..!!

పేద, మధ్య తరగతి వాళ్ళకి బంగారం కొనడం ఒక కల యే...అని చెప్పవచ్చు.... అలాంటి వారికి ""మంచి తరుణం -మించిన దొరకదు"

Update: 2024-11-17 11:22 GMT

పేద, మధ్య తరగతి వాళ్ళకి బంగారం కొనడం ఒక కల యే...అని చెప్పవచ్చు.... అలాంటి వారికి ""మంచి తరుణం -మించిన దొరకదు"".. ఊహించని రీతిలో బంగారం తారా స్థాయికి దిగొచ్చింది..

గతనెల 30 వ తేదీన, హైదరాబాద్ మార్కెట్లో...,పది గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో ఎవరూ ఊహించని విధంగా 81,800 కి చేరుకుంది..

కాగా పసిడి ప్రియులు ఇదే ఊపులో.....డిసెంబర్ నాటికి పది గ్రాముల బంగారం ధర రూ. లక్షకు చేరుతుందన్న అంచనాలు వేసుకున్నట్లు ఊహాగానాలు కూడా వినిపించాయి...!!

అందరి అంచనాలను తల క్రిందులు చేస్తూ...కేవలం 17 రోజుల్లోనే పది గ్రాముల బంగారం ధర రూ. 6,150 తగ్గింది..!!

ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో..పది గ్రాముల బంగారం ధర రూ. 75,650 కి దిగి వచ్చింది...!!

అక్టోబర్ నెల జీవితకాల గరిష్ట స్థాయికి చేరిన బంగారం ధర చూసి పసిడి ప్రియులు బంగారం కొనే ఆలోచనను సైతం పక్కన పెట్టేశారు.

ఈ ఏడాది ధన త్రయోదశి కూడా బులియన్ మార్కెట్ కు పెద్దగా కలిసి రాలేదు.

గత నెలలో కిలో వెండి ఏకంగా లక్షా 12వేలకు చేరింది. కానీ.. కొద్దిరోజులుగా వెండి కూడా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వెండి ధర కిలో 99 వేలు ఉంది. గత నెలతో పోల్చితే కిలో వెండిపై 13 వేల రూపాయల వరకు ధర తగ్గింది.

Tags:    

Similar News