Gold Price Today : హమయ్య ఎన్నాళ్లెకెన్నాళ్లకు ఇంతటి తీపి కబురు.. ఇక బంగారం కొనేయొచ్చు

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగానే తగ్గుముఖం పట్టాయి.

Update: 2024-11-08 03:57 GMT

బంగారం ధరలు ఎప్పుడూ అంతే. అంతర్జాతీయ పరిణామాలపై ధరల ప్రభావం ఆధారపడి ఉంటుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో డాలర్ కు రెక్కలొచ్చాయి. ఇక మదుపరులందరూ ఇతర మార్గాలకు మళ్లారు. దీంతో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం బంగారంపై ఉంటుందని తొలి నుంచి అంచనాలు వినపడుతున్న నేపథ్యంలో ఎన్నిక ప్రక్రియపూర్తయి ఫలితాలు వెలువడిన వెంటనే భారీ స్థాయిలో ధరలు పడిపోయాయి. దీంతో మదుపరుల నుంచి కొనుగోలుదారుల వరకూ అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పసిడిని కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు.

కొనుగోళ్లు తగ్గి.
వాస్తవానికి బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయినందున కొనుగోళ్లు తగ్గడంతో వ్యాపారులు కూడా ధరలు తగ్గాలని భావించారు. ధరలు తగ్గితే తమ వ్యాపారాలు పుంజుకుంటాయని భావించారు. సీజన్ సమయంలోనూ ధరలు పెరగడంతో పెట్టుబడిదారులు కూడా కొనుగోలుకు ఒకింత వెనకడుగు వేయడంతో ఎవరూ బంగారాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. ప్రధానమైన రోజుల్లోనూ సేల్స్ తక్కువగా ఉండటంతో వ్యాపారులు డీలా పడ్డారు. అయితే ఈ కష్టాల నుంచి ట్రంప్ బయటపడేశారు. ఒక్కసారిగా ధరలు అమాంతం తగ్గడంతో ఇక కొనుగోళ్లు పెరుగుతాయని వ్యాపారులు ఆశిస్తున్నారు. 72,000 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 78,560 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర 96,000 రూపాయలుగా ఉంది.
భారీగా తగ్గి...
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగానే తగ్గుముఖం పట్టాయి. బంగారం, వెండి ధరలు తగ్గడంతో మదుపరులు కొనుగోలుచేయడానికి ముందుకు వస్తున్నారు. మూడు రోజుల్లో బంగారం ధర నాలుగు వేల రూపాయలవరకూ తగ్గింది. కిలో వెండి ధరపై మూడు వేల రూపాయల వరకూ తగ్గింది. దీంతో మదుపరులు, వ్యాపారులు ఖుషీగా ఉన్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,000 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 78,560 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 96,000 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News