Gold Rates Today : పసిడి ప్రియులకు నేడు ఎంత తీపికబురో... ఈరోజే కొనేయండి
ఈరోజు మాత్రం దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా మార్పు కనిపించింది
బంగారం ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వెండి ధరలు కూడా దానితో పరుగులు తీస్తున్నాయి. బంగారం, వెండి ధరలు మరింత ప్రియమవుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్న అంచనాలు నిజమేననిపిస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధర 90 వేల రూపాయలకు చేరుకుంటుందని చెబుతున్నారు. అదే సమయంలో వెండి కిలో ధర లక్ష రూపాయల వరకూ పైచిలుకుగా ఉంది. బంగారం, వెండి ధరలు మరింత పెరుగడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, ట్రంప్ విజయం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధం వంటి కారణాలు ధరలు పెరుగుదలకు కనిపిస్తున్నాయి.
సీజన్ ప్రారంభం కావడంతో...
అయితే పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో పాటు ముహూర్తాలు కూడా అధికంగా ఉండటంతో గృహప్రవేశాలు, శుభకార్యాలు కూడా జరుగుతుండటంతో ఎక్కువ మంది బంగారం, వెండి కొనుగోలుకు సిద్ధపడుతున్నారు. బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని హెచ్చరికలతో కొనుగోలు చేసేవారు ముందుకు వచ్చి కొనేస్తున్నారు. మొన్నటి వరకూ మందకొడిగా సాగిన బంగారం ధరల విక్రయాలు తాజాగా ఊపందుకున్నాయి. దక్షిణ భారత దేశంలో బంగారం, వెండి కొనుగోలు చేసే వారు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ సెంటిమెంట్ గా మారింది. స్టేటస్ సింబల్ గా కూడా మారడంతో బంగారాన్ని ఎక్కువ మంది కొనుగోలు చేస్తుంటారు.
ధరలు తగ్గి...
దేశంలో బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న కాలంలో ధరలు మరింత పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. అయితే ఈరోజు మాత్రం దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా మార్పు కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై 120 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,740 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 79,350 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,02,900 రూపాయలుగా నమోదయింది.