Gold Price Today : మహిళలకు గుడ్ న్యూస్... భారీగా తగ్గిన బంగారం ధరలు
దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి
బంగారం ధరలు మరింత ప్రియం కానున్న నేపథ్యంలో కొంత ఊరట కలిగిస్తున్నాయి. పసిడి ధరలు మరింత పెరుగుతాయని భావిస్తున్న నేపథ్యంలో అమెరికాలో ట్రంప్ గెలుపుతో ఒకింత గోల్డ్ రేట్స్ దిగి వస్తున్నాయి. బంగారం ధరలతో పాటు వెడి ధరలు కూడా తగ్గుతూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటి వరకూ కొనుగోళ్లు ధరలు అమాంతం పెరగడంతో కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదు. పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ ధరలు మనకు అందుబాటులో లేకపోవడంతో ధరలు దిగి వచ్చినప్పుడు కొనుగోలు చేయవచ్చన్న భావనలో ఎక్కువ మంది ఉండటంతో వ్యాపారుల వద్ద బంగారు ఆభరణాలు మిగిలిపోయాయి.
పెట్టుబడి పెట్టే వారు...
ఇక పెట్టుబడి పెట్టే వారు సయితం కొంత ఆలోచిస్తున్నారు. బంగారంపై పెట్టుబడి సురక్షితమైనదే. ఎప్పటికైనా ధరలు పెరుగుతాయి. కానీ ఇంత ధరలు పెట్టి కొనుగోలు చేయడం అవసరమా? అన్న భావన వినియోగదారుల్లో కలుగుతుంది. అందుకే కొంత ధరలు దిగి వచ్చినప్పుడు మనం కొనుగోలు చేయవచ్చన్న ధోరణిలో పెట్టుబడి దారులు కూడా ఉన్నారు. ఇప్పుడు బంగారం గతం కంటే ఎక్కువ ధర పలుకుతుంది. స్టేటస్ సింబల్ గా మారింది. కుటుంబాల్లో జరిగే ప్రతి ఫంక్షన్ లో దానికి చోటు లేకుండా ఉండదు. అలాంటి బంగారానికి డిమాండ్ తగ్గడంతో ధరలు కూడా దిగి రాక తప్పడం లేదు. జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం కూడా అనేక ఆఫర్లు సిద్ధం చేశాయి.
భారీగా తగ్గిన ధరలు...
బంగారం, వెండి ధరలు గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. ట్రంప్ గెలిచిన నాటి నుంచి ధరల్లో తగ్గుదల కనిపిస్తుండటంతో వినియోగదారుల్లో ఒకింత ఆనందం వ్యక్తమవుతుంది. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,190 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 78,750 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర మాత్రం దాదాపు 1100 రూపాయల వరకూ తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర 1,01,900 రూపాయలకు దిగి వచ్చింది.