Gold Price Today : మహిళలు ఇక బంగారం కొనగలరా? ఇలా పెరుగుతూ పోతుంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. అలాగే వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి.
బంగారం ధరలు గత కొద్ది రోజులుగా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వరస పెరుగుదలను నమోదు చేసుకుంటున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పరుగులు తీస్తున్నాయి. మొన్నటి వరకూ కొద్దిగా తగ్గి ఊరిస్తూ, కొనుగోలుకు సహకరించాలని రా రమ్మంటూ పిలిచిన పసిడి, వెండి ఆ తర్వాత మాత్రం వరసపెట్టి పెరుగుతుండటం వినియోగదారులకు ఆందోళన కలిగిస్తుంది. ఇక బంగారాన్ని భవిష్యత్ లో కొనుగోలు చేయడం కష్టమేనేమోనన్న స్థాయిలో పసిడి ధర పెరుగుతుందంటే అతిశయోక్తి కాదు. దేశంలో స్థిరంగా ఉండకుండా బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
కొందరికే సొంతంగా...
బంగారం అంటే ఇక కొందరికే సొంతమవుతుందన్న అభిప్రాయం ధరలను చూస్తే అర్థమవుతుంది. గ్రాము బంగారం కొనుగోలు చేయాలన్నా వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు తరుగు, జీఎస్టీ వంటివి అదనంగా వ్యాపారులు వసూలు చేస్తుండటం వల్ల అదనపు భారంగా మారుతుంది. ఇప్పటి వరకూ ఆ రూపంలో బాదుతున్నా భరించిన వినియోగదారులు పెరిగిన ధరలతో వాటిని తగ్గించాలంటూ వ్యాపారుల మీద ఒత్తిడి తెస్తున్నారని చెబుతున్నారు. మరో వైపు తరుగు పేరిట డిస్కౌంట్ ఆఫర్లు కూడా భారీగానే నడుస్తున్నాయి. రానున్న కాలంలో సీజన్ ప్రారంభం కానుండటంతో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు.
భారీగా ధరలు పెరిగి...
అదే జరిగితే మహిళలు బంగారాన్ని కొనుగోలు చేయడం ఇక కష్టమేనని అంటున్నారు. ముఖ్యంగా మధ్య, పేద తరగతి వర్గాలు బంగారాన్ని కొనుగోలు చేయడం ఇప్పటికే కష్టం కాగా, ఎగువ మధ్యతరగతి వర్గాలకు కూడా పెరిగిన బంగారం ధరలు షాక్ ఇస్తున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. అలాగే వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై నలభై రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,200రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,300 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,03,000 రూపాయలుగా ఉంది.