Gold Price Today : పండగ పూట మహిళలకు షాకిచ్చిన బంగారం ధరలు
ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా కొద్దిగా పెరిగాయి
పసిడి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. దిగి వచ్చే అవకాశం లేదనిపిస్తుంది. ఎందుకంటే ఇక సీజన్ ప్రారంభమయితే పుత్తడి ధరలు పరుగులు తీస్తాయే తప్ప ఆగేది ఉండదు. అందుకే ఇప్పుడే బంగారాన్ని కొనుగోలు చేయదలచుకున్న వారు ఇదే మంచి టైమ్ అని చెబుతున్నారు మార్కెట్ రంగ నిపుణులు. రానున్న కాలంలో ధరలు మరింత ప్రియమై అందకుండా పోయే అవకాశముందన్న హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. డిమాండ్ ఎప్పటికప్పుడు బంగారానికి పెరుగుతుండటంతో వాటి ధరలు కూడా అలాగే పెరుగుతున్నాయి. పండగ సీజన్ తో పాటు పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలయితే మాత్రం ఇక బంగారం ధరలను అదుపు చేయడం ఎవరి తరమూ కాదంటున్నారు.
అమితంగా ఇష్టపడి...
పసిడి అంటేనే భారత దేశంలో అమితంగా ఇష్టపడతారు. ఒకటి... బంగారం ఉంటే భద్రత ఉంటుందని.. రెండోది.. స్టేటస్ సింబల్. ఈ రెండు కారణాలతో బంగారానికి గిరాకీ ఎప్పుడూ తగ్గదు. అయితే ధరలు పెరిగినప్పుడల్లా ఉస్సూరమనిపించి ఇక కొనుగోలు చేయమని బయటకు చెబుతున్నప్పటికీ ఎప్పటికప్పుడు పుత్తడిని కొనుగోలు చేయడానికి అలవాటు పడిపోయారు. చిన్న ఫంక్షన్ అయినా చాలు బంగారు వస్తువు కానుకగా ఇవ్వడం ఇప్పుడు హాబీగా మారడంతో అది విలువైన వస్తువుగా మారుతుంది. ఎక్కువగా ఆభరణాలు కొనుగోలు చేస్తుండటంతో పెరిగిన ధరలతో పాటు అదనంగా జీఎస్టీ కూడా జమ అవుతుండటంతో వినియోగదారులకు మరింత భారమవుతుంది.
ధరలు పెరిగి...
అయినా సరే బంగారం అమ్మకాలు ఏ మాత్రం తగ్గడం లేదు. అవి నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. 365 రోజుల పాటు పసిడి విక్రయాలకు ఢోకా ఉండదు. ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా కొద్దిగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 70,960 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,410 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,02,100 రూపాయలు పలుకుతుంది.