Ratan Tata Mukesh Ambani: రతన్ టాటా మరణంపై ముకేశ్ అంబానీ ఎమోషనల్ నోట్!

ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా

Update: 2024-10-10 03:16 GMT

MukeshAmbani, RatanTata

ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా బుధవారం నాడు తుదిశ్వాస విడిచారు. టాటా సన్స్ మాజీ ఛైర్మన్ 86 ఏళ్ల రతన్ టాటా మరణం వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీతో సహా పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది. రతన్ టాటా మరణంపై ముకేశ్ అంబానీ విచారాన్ని వ్యక్తం చేశారు. తన ప్రియమైన స్నేహితుడిని కోల్పోవడం గురించి ఒక ప్రకటన విడుదల చేశారు.

భారతదేశానికి ఇది చాలా విచారకరమైన రోజని ముకేశ్ అంబానీ తెలిపారు. రతన్ టాటా మరణించడం టాటా గ్రూప్‌కే కాదు, ప్రతి భారతీయునికి పెద్ద నష్టమని ముకేశ్ అంబానీ వెల్లడించారు. వ్యక్తిగతంగా రతన్ టాటా మరణం తనకు తీరని శోకాన్ని నింపిందని, ఒక ప్రియమైన స్నేహితుడిని కోల్పోయానన్నారు అంబానీ. ఆయన ఎంతో గొప్పవ్యక్తి, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తిత్వం ఉన్న మనిషి అంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కొనియాడారు.
"రతన్ టాటా మరణంతో భారతదేశం అత్యంత విశిష్టమైన వ్యక్తిని కోల్పోయింది. టాటా భారతదేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. ప్రపంచంలోని అత్యుత్తమమైన వాటిని భారత్‌కు తీసుకువచ్చారు. 1991లో ఆయన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి టాటా గ్రూప్‌ ఎన్నో రెట్లు ఎదిగింది. రిలయన్స్, నీతా, అంబానీ కుటుంబం తరపున, టాటా కుటుంబ సభ్యులకు, మొత్తం టాటా గ్రూపు సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. రతన్, నువ్వు ఎప్పుడూ నా హృదయంలో నిలిచి ఉంటావు. ఓం శాంతి’’ అంటూ ఎమోషనల్ నోట్ ను ముకేశ్ అంబానీ విడుదల చేశారు.


Tags:    

Similar News