Gold Price Today : పండగ వేళ అదిరిపోయే శుభవార్త.. బంగారం ధరల్లో ఇంత తగ్గుదలా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా పెరుగుదల కనిపించింది
బంగారం అంటేనే ఇష్టం లేనిది ఎవరికి? కష్టమయినా బంగారాన్ని కొనుగోలు చేయాలని అనుకునే వారు 90 శాతం మంది ఉన్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ములో కూడబెట్టి మరీ పసిడి కొనుగోలు చేసే వారు ఎందరో ఉన్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. పేద, మధ్య తరగతి నుంచి ఉన్నత వర్గాల వరకూ తేడా లేకుండా పసిడి కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎందుకంటే తమ జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు ఆదుకునేది బంగారం మాత్రమే. బంగారం తమ వద్ద ఉంటే బతుకు భధ్రతగా ఉంటుందని నమ్ముతారు. అందుకే బంగారాన్ని శ్రమించి కొనుగోలు చేయడానికి ఏమాత్రం వెనుకాడరు.
మరింత పెరుగుతాయని...
దసరా పండగకు బంగారం ధరలు మరింత పెరుగుతాయని భావించారు. అందుకే పసిడిని ముందుగానే కొనుగోలు చేయడానికి ఎగబడతారు ప్రజలు. అందుకే జ్యుయలరీ దుకాణాలు రోజుతో నిమిత్తం లేకుండా కిటకిటలాడిపోతుంటాయి. బంగారం తగ్గిందా? పెరిగిందా? అన్నది మాత్రం చూడరు. ఎందుకంటే దానిని సొంతం చేసుకుంటే ధరలు పెరుగుతుంది మాత్రమే కాని తగ్గదన్నది అందరికీ తెలుసు. ఇక త్వరలో సీజన్ ప్రారంభం కానుంది. రెండు నెలలు సీజన్ జోరుగా నడుస్తుంది. మంచి ముహూర్తాలున్నాయి. బంగారం ధరలు ఖచ్చితంగా పెరుగుతాయన్న అంచనాలతో ముందుగానే కొనుగోలు చేయడానికి రెడీ అయిపోయారు మహిళలు.
ధరలు భారీగా...
పసిడి ధరలు గత కొద్ది రోజులుగా షాకిచ్చాయి. కానీ కొద్ది రోజుల నుంచి స్వల్పంగా, స్థిరంగా కొనసాగుతున్నాయి. రెండు రోజుల్లోనే దాదాపు రెండు వందల రూపాయలు తగ్గడం కూడా మహిళలను ఆకట్టుకుంది. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా పెరుగుదల కనిపించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 70,990 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,440 రూపాయలు పలుకుతుంది. కిలో వెండి ధర 1,02,900 రూపాయలుగా ఉంది.