Gold Price Today : బంగారం కొనుగోలుదారులకు నేడు గుడ్ న్యూస్

ఈరోజు బంగారం ధరలు దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి.

Update: 2024-10-06 03:58 GMT

పసిడి ధరలు పెరగకుంటే అంతే చాలు. తగ్గకపోయినా పరవాలేదు. రానీ భారీగా పెరుగుదల కనిపించకుంటే చాలు అన్న ధోరణిలో పసిడి ప్రియులు వచ్చేశారు. మానసికంగా వారు అందుకు సిద్ధమయ్యారు. ఎందుకంటే పెరిగిన ధరలను చూసి విసుగెత్తిన గోల్డ్ లవర్స్ పుత్తడి ధర రోజువారీ ఆశలు పెట్టుకోవడం మానేసి చాలా రోజులయింది. బులియన్ మార్కెట్ నిపుణులు కూడా ధరలు పెరుగుదలపై పెద్దగా ఆశ్చర్యపోవడం లేదు. రానున్న కాలంలో ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. అనేక కారణాలు బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణమవుతున్నాయని చెబుతున్నప్పటికీ ఆ కారణాల జోలికి వెళ్లే కన్నా అదుపు పడేది ఎప్పుడన్నదే వినియోగదారుల ఆలోచనగా ఉంది.

పెరగడంపై...
పసిడి ధరలు పెరగడం ఎప్పుడూ జరిగేదే. ఇది కొత్త విషయమేమీ కాదు. గత కొద్ది సంవత్సరాలుగా పెరుగుతున్న ధరలకు అలవాటు పడిపోయారు. ఇక పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో ధరలు మరింత పెరిగే అవకాశముందని తెలిసీ ఏమీ చేయలేేని పరిస్థితి. ఇప్పటికే పెళ్లి ముహూర్తాలు కుదిరిన వారు మాత్రం బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. కొంత కాలం దాటితే మాత్రం ధరలకు రెక్కలు వస్తాయన్నది గ్యారంటీ. అందుకే పసిడి కొనుగోలు చేసే వారికి ఇదో టెన్షన్ గా మారింది. ఇక బిందాస్ గా ఉన్న వారు ఎవరైనా ఉన్నారంటే బంగారాన్ని పెట్టుబడిగా కొనుగోలు చేయడం అలవాటు చేసుకున్న వారు మాత్రమే. అందుకే ధరలపై ఎవరికీ ఏ చింతా లేదు.
పసిడి ధరలు ప్రియంగా...
పసిడి ధరలు మరింత పెరగడం ఖాయం. కానీ అవి ఎంత పెరుగుతాయని చెప్పలేం. ఈరోజు బంగారం ధరలు దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. ఉదయం ఆరు గంటల వరకూ మాత్రమే ఈ ధరలు ఉంటాయి. మధ్యాహ్నానికి పెరగొచ్చు. తగ్గొచ్చు. ఇలాగే స్థిరంగా ఉండొచ్చు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,200 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,670 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 97,000 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News