Gold Price Today : పసిడి కొనుగోలు చేసే వారికి నేడు గుడ్ న్యూస్
నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి
బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ప్రతి రోజూ ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. డిమాండ్ కు తగినట్లు బంగారం నిల్వలు లేకపోవడం ఒక కారణమయితే అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయి. అందుకే బంగారం ధరలు ప్రతి రోజూ అదే మాదిరిగా ఉంటాయని చెప్పలేం. భారీగా పెరగవచ్చు. తగ్గవచ్చు. స్థిరంగా కొనసాగవచ్చు. అందుకే బంగారం తగ్గినప్పుడే కొనుగోలు చేయాలని మార్కెట్ నిపుణులు ఎప్పటికప్పుడు సూచిస్తుంటారు.
పండగల సీజన్ కావడంతో...
దసరా పండగకు ఎక్కువ సంఖ్యలో బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఇక ఇదే నెలలో దీపావళి పండగ కూడా ఉంది. దీపావళికి బంగారం కొనుగోలు చేస్తుండటం సంప్రదాయంగా వస్తుంది. దీంతో ఈ నెల అంతా పండగల సీజన్ కావడంతో బంగారం దుకాణాలన్నీ వినియోగదారులతో కిటకిట లాడిపోతుంటాయి. ఇక మదుపుపరులు తాము పొదుపు చేయడానికి బంగారాన్ని ఎంచుకుంటారు. అందుకే ధరలు తగ్గినప్పుడు బంగారాన్ని ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తుంటారు. రానున్న రెండు నెలల పాటు పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న హెచ్చరికలతో ఇప్పుడే కొనుగోలు చేయడానికి అనేక మంది ముందుకు వస్తారు.
నేటి ధరలు ఇలా...
నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. అయితే ఈ ధరలు ఉదయం ఆరు గంటలకు మాత్రమే ఉన్నాయి. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 70,990 రూపాయల వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,400 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,03,000 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది. అందుకే ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని సూచనలు వినిపిస్తున్నాయి.