Gold Price Today : బ్యాడ్ లక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. పరుగు ప్రారంభించినట్లేనా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.
బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో, ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేం. మొన్నటి వరకూ బంగారం, వెండి ధరలు తగ్గాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తి కావడం, ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో బంగారం ధరలు భారీగా తగ్గాయి. దీంతో వినియోగదారులు ఆనంద పడ్డారు. వరసగా ఎంతోకొంత ధరలు తగ్గుతూ కొనుగోలుదారులను ఊరించాయి. బంగారం కొనుగోళ్లు కూడా గతంలో కంటే పెరిగాయి. దీంతో ఇంకా ధరలు తగ్గుతాయోమోనని ఎంతగానో ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది. బంగారం ధరలు ఒకసారి పరుగులు పెడితే చాలు ఇక వాటిని ఆపడం కష్టమేనని వ్యాపారులు కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోలు చేయడానికి...
పెట్టుబడిదారులు మరికొంత ధరలు తగ్గితే బంగారం కొనుగోలు చేద్దామని వెయిట్ చేస్తుంటారు. బంగారంపై పెట్టుబడి సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. కానీ గత కొద్ది రోజుల నుంచి ధరలు తగ్గుతుండటంతో మదుపరులు కూడా ఒకింత ఆలోచనలో పడి కొనుగోళ్లకు దూరంగా ఉండిపోయారు. బాగా ధరలు తగ్గిన తర్వా త కొనుగోలు చేయవచ్చన్న ఆలోచనలో ఉన్నట్లుంది. అందుకే బంగారం, వెండి ధరలు మరింత తగ్గుతాయని ఊహించిన పెట్టుబడి దారులకు నేడు ధరలు షాకిచ్చేలా ఉన్నాయి. ధరలు పెరగడంతో పెట్టుబడిదారులు కూడా పునరాలోచనలో పడే అవకాశముంది. ఇక కొనుగోళ్లు ఊపందుకుంటాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
భారీగీ పెరిగి...
మార్కెట్ నిపుణులు కూడా రానున్న కాలంలో బంగారం, వెండి ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. వారి అంచనాలు నిజమయినట్లు కనిపిస్తున్నాయి. ఈరోజు ఉదయం ఆరు గంటల వరకూ హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నానికి ధరలు పెరగొచ్చు. తగ్గొచ్చు. స్థిరంగా కూడా ఉండొచ్చు. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధరపై 600 రూపాయల వరకూ పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 69,950 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 76,310 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 99,000 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.