Gold Price: భారీగా తగ్గిన బంగారం ధర
బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఒక్క రోజే ఏకంగా;

బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఒక్క రోజే ఏకంగా 1,500 రూపాయలకు పైగా తగ్గింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 91,450కి చేరింది. వారం రోజుల క్రితం ఈ ధర రూ. 93 వేల స్థాయిలో ఉండగా, తాజా తగ్గుదలతో రూ. 92 వేల దిగువకు పడిపోయింది. ఆభరణాల వర్తకులు, స్టాకిస్టులు అమ్మకాలకు మొగ్గుచూపడంతోనే పుత్తిడి ధర దిగి వచ్చినట్టు బులియన్ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారంపై రూ. 280 తగ్గి రూ. 90,380గా నమోదైంది. వెండి ధర కిలోకు రూ. 3 వేలు తగ్గి రూ. 92,500కు దిగి వచ్చింది. హైదరాబాద్‌లో మాత్రం కిలో వెండి ధర రూ. 1.03 లక్షలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 10.16 డాలర్లు తగ్గి 3,027 వద్ద ఉండగా, వెండి 30.04 డాలర్ల వద్ద కొనసాగుతోంది.