Gold Price Today : గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు ఎంత తగ్గాయో తెలుసా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది.;

Update: 2025-03-24 03:44 GMT
gold, silver, prices, india
  • whatsapp icon

బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. ఒకరోజు తగ్గాయని ఆనందించే లోగా పది రోజులు పాటు పెరుగుదల ధరల్లో కనిపిస్తుంది. ధరలు తగ్గినప్పటికీ స్వల్పంగానే తగ్గుతాయి. అదే ధరలు పెరిగితే మాత్రం భారీగా గ్రాముకు వందల రూపాయల మేరకు పెరుగుతుంది. తగ్గితే పది గ్రాములపై పది రూపాయలు మాత్రమే తగ్గడం అనేక సార్లు చూస్తున్నాం. ఇప్పటికే బంగారం ధరలు పది గ్రాములు 90 వేలకు చేరుకున్నాయి. కిలో వెండి ధర కూడా లక్షా పది వేల రూపాయలుగా ఉంది. ఈ పరిస్థితుల్లో కొనుగోలు చేయడం అంటే ఆషామాషీ కాదు. ధరలు పెరిగితే డిమాండ్ తగ్గుతుందని భావిస్తాము కానీ కొనుగోలు చేసే వాళ్లు ఇంకా కొందరున్నారు.

సీజన్ అయినప్పటికీ...
ధరలు పెరుగుదల చూసి వ్యాపారులే ఇబ్బంది పడుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ లో ఇంత భారీగా ధరలు పెరగడంతో గత సీజన్ కంటే దాదాపు డెబ్భయి శాతం కొనుగోళ్లు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నప్పటికీ రోజురోజుకూ పెరుగుతున్న బంగారం ధరలను చూసి వినియోగదారులు జ్యుయలరీ దుకాణాల వైపు చూసేందుకు కూడా వెనకాడుతున్నారు. మరోవైపు పెట్టుబడి పెట్టే వారు మాత్రం ఎప్పటిలాగానే బంగారం, వెండి కొనుగోలు చేస్తున్నారు. బంగారం, వెండి ధరలు పెరగడమే తప్ప తగ్గవని భావించి, దీనిపై పెట్టుబడి సురక్షితమైనదిగా అనుకుని పెట్టుబడి దారులు ఎక్కువ మంది కొనుగోలు చేస్తుండటం వ్యాపారులకు కొంత ఊరట నిచ్చే అంశంగానే చూడాలి.
ఈరోజు ధరలు...
నిజానికి ధరలు పెరగడానికి అనేక కారణాలున్నప్పటికీ బంగారం, వెండి వస్తువులకు సంబంధించి గిరాకీ మాత్రం తగ్గడం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గతంలో కంటే కొంత కొనుగోళ్లు తగ్గి ఉండవచ్చేమో కానీ, పూర్తి స్థాయిలో అమ్మకాలు లేవని చెప్పడం సరికాదని అంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 82,290 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 89,700 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,09,900 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News