Gold Price Today : నేడు కూడా షాకిచ్చిన బంగారం ధరలు... ఇక పెరగడమేనా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో మాత్రం తగ్గుదల కనిపించింది.
బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పెరగడం ప్రారంభిస్తే ఇక ఆగేది ఉండదు. అందులోనూ సీజన్ ప్రారంభం కావడంతో పసిడి ధరలకు రెక్కలు వచ్చినట్లే కనపడుతుంది. తులం బంగారంపై 110 రూపాయలు పెరిగింది. పసిడి అంటేనే పిచ్చిగా కొనుగోలు చేసే వారు ఉన్నంత వరకూ బంగారం ధరలకు కళ్లెం పడదన్నది మార్కెట్ నిపుణుల అభిప్రాయం. చిన్నా, చితకా కార్యక్రమాలకు కూడా బంగారం కొనుగోలు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రతి రోజూ బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో మరింత పెరుగుతాయంటున్నారు.
అనేక కారణాలతో...
పసిడి కొనుగోలు చేయడానికి అస్సలు ఎవరూ వెనుకంజ వేయడం లేదు. దీంతో పాటు వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఇక పసడి, వెండి ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. ఇజ్రాయిల్ - హమాస్ మధ్యయుద్ధం ప్రభావం కూడా బంగారం ధరలపై ప్రభావం పడిందంటున్నారు. దీనికి తోడు ఆర్థిక మాంద్యం, డాలర్ తో రూపాయి తగ్గుదల, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు వంటివి కూడా వీటి ధరల పెరుగుదలకు కారణమని తెలిసింది. ధరలు పెరుగుతుండటంతో వినియోగదారుల ఒకింత అసహనానికి లోనవుతున్నా కొనుగోలు విషయంలో మాత్రం వెనక్కు తగ్గడం లేదని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
పెరిగిన ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో మాత్రం తగ్గుదల కనిపించింది. తులం బంగారం ధరపై 110 రూపాయలు పెరిగింది. వెండి కిలో ధరపై స్వల్పంగానే తగ్గింది. అయితే ఆరు గంటల వరకూ మాత్రమే ఈ ధరలు నమోదయ్యాయి. మధ్యాహ్నానికి మరింత పెరగొచ్చు. తగ్గొచ్చు. స్థిరంగా కూడా కొనసాగే వీలుందని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,100 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,560 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 95,000 రూపాయలుగా ఉంది.