వాహనదారులకు షాకిచ్చిన హీరో మోటో కార్ప్
దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ రకరకాల వాహనాలను తయారు..
దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ రకరకాల వాహనాలను తయారు చేస్తూ అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. అయితే సెలెక్టెడ్ మోటారు సైకిళ్లు, స్కూటర్లపై ధరలు పెంచనున్నట్లు తెలుస్తోంది పెంచనున్నది. అక్టోబర్ 3వ తేదీ నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయి కంపెనీ వెల్లడించింది. అయితే ముడి సరుకుల ధరలు పెరగడం కారణంగా ధరలను పెంచక తప్పడం లేదని హీరో మోటో తెలిపింది. ముడిసరుకు, లాజిస్టిక్, ప్రొడక్ట్ కాంపిటీటివ్‌నెస్ తదితర కారణాలతో ధరలు పెంచక తప్పడం లేదని శనివారం వెల్లడించింది. ఆయా మోడల్ మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరల పెంపు వేర్వేరుగా ఉంటుందని తెలిపిన మోటో కార్ప్.. ఏయే మోడళ్ల ధరలు పెరుగుతాయన్న విషయం వెల్లడించలేదు.
ప్రస్తుతం హీరో మోటో కార్ప్.. ఎంట్రీ లెవల్ స్ప్లెండర్ + నుంచి కొత్తగా ఆవిష్కరించిన కరిజ్మా ఎక్స్ఎంఆర్ వరకూ పలు రకాల మోటారు సైకిళ్లను తయారు చేస్తూ అందుబాటులోకి తీసుకువస్తోంది. వీటితోపాటు అమెరికా కేంద్రంగా పని చేస్తున్న మోటారు సైకిళ్ల తయారీ సంస్థ హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.మరోవైపు ఇటీవలే మార్కెట్లో ఆవిష్కరించిన డెస్టినీ ప్రైమ్ నుంచి ఫ్లాగ్ షిప్ మాస్ట్రో ఎడ్జ్ 125 వరకూ ఐదు రకాల స్కూటర్లు విక్రయిస్తోంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఎంపిక చేసిన మోటారు సైకిళ్లపై ఒక శాతం ధరలు పెంచుతున్నట్లు తెలిపింది.