పీఎం కిసాన్ 15వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..?
మోడీ ప్రభుత్వం దేశ ప్రజల కోసం రకరకాల పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర అమలు చేస్తున్న పథకాల్లో రైతుల కోసం..
మోడీ ప్రభుత్వం దేశ ప్రజల కోసం రకరకాల పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర అమలు చేస్తున్న పథకాల్లో రైతుల కోసం రూపొందించిన పీఎం కిసాన్ సమ్మాన్ యోజన స్కీమ్ ఒకటి. ఈ స్కీమ్ ద్వారా రైతుకు ఏడాదికి 6 వేల రూపాయల చొప్పున కేంద్రం అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో 2 వేల రూపాయల చొప్పున అందిస్తోంది. అయితే ఇప్పటి వరకు రైతులకు 14వ విడత డబ్బులు రాగా, ఇప్పుడు 15వ విడత కోసం రావాల్సి ఉంది. ఈ విడత సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ డబ్బులు ఎప్పుడు పడాతాయన్నది అధికారికంగా వెల్లడించకపోయినా.. 15వ విడత డబ్బులు నవంబర్ 30 లేదా అంతకంటే ముందు రైతులు ఖాతాల్లో పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మీరు pmkisan.gov.in వెబ్‌సైట్ ద్వారా మీ ఇన్‌స్టాల్‌మెంట్ స్థితిని తనిఖీ చేయవచ్చు.
పథకం ఎవరికి ఉపయోగపడుతుంది?
15వ విడతను చెక్ చేసుకోవడం ఎలా?
☛ రైతు ముందుగా పీఎమ్ కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/కి వెళ్లాలి.
☛ ఆ తర్వాత కుడి వైపున కనిపిస్తున్న ఆప్షన్‌లో ఉన్న బెనిఫిషియరీ స్టేటస్‌ను ఎంచుకోవాలి.
☛ తర్వాత ఆధార్ లేదా ఖాతా నెంబరును ఎంటర్ చేసి 'గెట్ డేటా' పై క్లిక్ చేయాలి.
☛ ఆ తర్వాత స్క్రీన్‌పై స్టేటస్ కనిపిస్తుంది.
☛ బెనిఫిషియరీ స్టేటస్ కింద బెనిఫిషియరీ జాబితా ఆప్షన్ కనిపిస్తుంది.
☛ ఆ తర్వాత ఆప్షన్‌పై క్లిక్ చేయగానే మరొక పేజీ ఓపెన్ అవుతుంది.
☛ అక్కడ రైతు రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామాలను ఎంచుకుని 'గెట్ రిపోర్ట్'పై క్లిక్ చేస్తే లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది.