Gold Price Today : బంగారం కొనుగోళ్లకు ఇదే మంచి సమయం.. నేడే కొనండి
నేడు దేశంలో పసిడి ధరలు కొంత స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో తగ్గుముఖం పట్టాయి
బంగారం ధరలు ఎప్పుడూ నిలకడగా ఉండవు. ఎక్కువ సార్లు పెరుగుతూ ఉంటాయి. తక్కువ సార్లు తగ్గుతూ ఉంటాయి. కొన్ని సార్లు మాత్రమే స్థిరంగా కొనసాగుతాయి. తగ్గినా, స్థిరంగా ఉన్నా అది మనకు శుభవార్తే. బంగారం ధరలు పెరగకపోతే అంతే చాలు అనుకునే రోజులు వచ్చాయి. గతంలో మాదిరిగా ఇంకా తగ్గుతాయని భావించి వెయిట్ చేయడం వేస్ట్ అని అనేక మంది భావిస్తున్నారు. ఎందుకంటే ఒకసారి పైకి పాకిన బంగారం ధరలు మళ్లీ తగ్గే అవకాశమే లేదు. తగ్గినా స్వల్పంగానే కాబట్టి ఎప్పటికప్పుడు కొనుగోలు చేయడం మంచిదని అనేక మంది ఆలోచన. మార్కెట్ నిపుణులు కూడా అదే చెబుతున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం...
ఇక బంగారం, వెండి ధరల్లో నిత్యం అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అందులో నేడు అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశముంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాలను బట్టి బంగారం భారీగా పెరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేం అంటున్నారు మార్కెట్ నిపుణులు. వ్యాపారులదీ అదే మాట. అంతర్జాతీయ ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు వంటివి బంగారం ధరల మార్పులపై ప్రభావం చూపనున్నాయి. పండగలతో పాటు పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభం కావడంతో ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు వినిపడుతున్నాయి.
భారీగా తగ్గిన వెండి ధరలు...
బంగారం కొంత తగ్గినప్పుడే కొనుగోలు చేయాలి. అందుకే నేడు బంగారం కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. ఎందుకంటే నేడు దేశంలో పసిడి ధరలు కొంత స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,540 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 80,230 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర బాగా తగ్గింది. కిలో వెండి ధర 96,353 రూపాయలుగా కొనసాగుతుంది.