ఆ రైతులకు కేంద్రం షాక్.. పీఎం కిసాన్ నుంచి 1.72 కోట్ల మంది ఔట్
కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. అందులో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి. ఈ పథకాన్ని ప్రత్యేకంగా రైతులను ..
కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. అందులో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి. ఈ పథకాన్ని ప్రత్యేకంగా రైతులను ఉద్దేశించి అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ పథకంలో రైతుకు ఏడాదికి మూడు విడతల్లో రూ. 2000 చొప్పున మొత్తం రూ.6000ను రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం. ఈ ఈ పథకం వచ్చిన నాటి నుంచి అర్హులు కూడా చాలా మంది లబ్ది పొందుతున్నారు. ఈ పథకంలో చిన్న, సన్నకారు రైతులందరికీ మూడు విడతలు గా సంవత్సరానికి రూ. 6,000 అందిస్తోంది. అయితే అనర్హులు ఎక్కువగా పెరిగిపోవడంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అనర్హులను తొలగించే పనిలో ఉంది. ఈ ప్రక్రియ గత ఏడాది నుంచి చేపడుతోంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) యోజన డేటాబేస్‌లో అనర్హులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల భారీ తొలగింపుల కార్యక్రమం చేపట్టింది. ఈ పథకం కింద లబ్ది పొందుతున్న అనర్హులు 1.72 కోట్ల లబ్ధిదారులను తొలగించింది కేంద్ర ప్రభుత్వం.
పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాను ఎలా తనిఖీ చేయాలి?
- pmkisan.gov.in వద్ద PM కిసాన్ పథకం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- హోమ్‌పేజీలో 'ఫార్మర్స్ కార్నర్' లింక్‌పై క్లిక్ చేయండి.
- 'బెనిఫిషియరీ లిస్ట్' లింక్‌పై క్లిక్ చేయండి. అలాగే మీరు మరొక వెబ్‌పేజీకి దారి మళ్లించబడతారు.
- మీ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామాన్ని ఎంచుకుని, ఆపై 'గెట్ రిపోర్ట్' బటన్‌పై క్లిక్ చేయండి.