దేశంలోనే అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు.. ఫీచర్స్‌ ఎంటో తెలిస్తే..

Rolls Royce EV: లగ్జరీ సెగ్మెంట్ ప్రముఖ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ స్పెక్టర్‌ను..

Update: 2024-01-25 11:35 GMT

Rolls Royce EV Car

Rolls Royce EV: లగ్జరీ సెగ్మెంట్ ప్రముఖ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ స్పెక్టర్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు ఉత్తర భారతదేశంలో విడుదలైంది.

ఆకర్షణీయమైన లుక్స్, శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్, లగ్జరీ ఫీచర్లతో ప్యాక్ చేయబడిన ఈ కారు ప్రారంభ ధర రూ.7.5 కోట్లు (ఎక్స్-షోరూమ్). రోల్స్ రాయిస్ స్పెక్టర్ దేశంలోనే అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు. ఈ కారు అధికారిక బుకింగ్‌ను కూడా కంపెనీ ప్రారంభించింది.

కంపెనీ రోల్స్ రాయిస్ స్పెక్టర్‌ను సాంప్రదాయ డిజైన్‌లో 22 ఎల్‌ఈడీ లైట్లతో నిర్మించింది. ఇవి రాత్రిపూట అందాన్ని పెంచుతాయి. ఎక్ట్సీరియర్ మాదిరిగానే, స్పెక్టర్ ఇంటీరియర్ కూడా ఇప్పటికే ఉన్న రోల్స్ రాయిస్ మోడల్‌ల మాదిరిగానే ఉంటుంది. కొత్తదనం ఏంటంటే.. ఇప్పటి వరకు రూఫ్ మీద మాత్రమే ఉండే స్టార్ లైట్ లైనర్ ఇప్పుడు డోర్ ప్యాడ్స్ లోనూ ఉంది. అందుకే మీరు కారు క్యాబిన్ నుండి కూడా స్కై వ్యూని చూడవచ్చు.

స్పెక్టర్ ఇంటీరియర్‌లో మరో ప్రధాన మార్పు రోల్స్ రాయిస్ కొత్త సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్ 'స్పిరిట్'. ఇప్పటి వరకు, రోల్స్ రాయిస్ BMW ఇన్ఫోటైన్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించింది. కానీ ఈ కారులో కంపెనీ తన సొంత 'స్పిరిట్' సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించింది. ఈ కారుకు మరో ప్రత్యేక ఫీచర్ ఉంది. ఈ ఫీచర్ సహాయంతో కారు డయల్ రంగును కూడా మార్చవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కారు బరువు 2,975 కిలోలు. పొడవు 5,453 mm, వెడల్పు 2,080 mm, ఎత్తు 1,559 mm.

ఈ కారులోని ఎలక్ట్రిక్ మోటార్ 575 బిహెచ్‌పి పవర్, 900 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అందుకే ఈ లగ్జరీ కారు కేవలం 4.5 సెకన్లలో 0 నుండి 100 కి.మీ/గం వేగాన్ని అందుకోగలదు. కంపెనీ ఈ కారులో 102-kWh సామర్థ్యం గల శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్‌ను అందించింది. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 520 కిమీల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. కారు బ్యాటరీ 195kW ఛార్జర్ సహాయంతో కేవలం 34 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. అయితే 50kW DC ఛార్జర్ సహాయంతో దాని బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 95 నిమిషాలు పడుతుంది.

Tags:    

Similar News