Gold Price Today : లక్ష రూపాయలకు చేరువలో వెండి.. నేడు పసిడి ధర ఎంత పెరిగిందో తెలుసా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా ఒక్కసారిగా పెరిగాయి.
బంగారం అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. తరతమ బేధాలు లేకుండా పసిడి అందరినీ ఆకట్టుకుంటుంది. ఎంతగా అంటే తమ వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బులతోనైనా ఒక బంగారు వస్తువును కొనుగోలు చేయాలన్న కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అందుకు రోజులు అడ్డురావు. డబ్బులున్నప్పుడే బంగారాన్ని కొనుగోలు చేయడానికి అలవాటుపడిపోయారు. ధరలు పెరిగినా, తగ్గినా అనవసరం. భవిష్యత్ కు భరోసా ఉంటుందన్న నమ్మకంతోనే పసిడికి రోజురోజుకూ డిమాండ్ పెరుగుతుంది. అందుకే వాటి ధరలు కూడా పెరుగుతున్నాయి. ఒకప్పుడు సీజన్ లో మాత్రమే పెరిగే బంగారం ఇప్పుడు ప్రతి రోజూ వినియోగదారులను ఊరిస్తూ రా... రమ్మని పిలిచేంత దగ్గరగా వచ్చేసింది.
వినియోగదారులను...
దీంతో బంగారాన్ని కొనుగోలు చేసే వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరిగిపోయింది. అందుకే జ్యుయలరీ దుకాణాలు నిత్యం కిటకిటలాడుతుంటాయి. సెలవు దినాల్లో మరింతగా కళకళలాడుతూ కనిపిస్తాయి. వివిధ రకాల డిజైన్లతో వినియోగదారులను ఎప్పటికప్పుడు ఆకట్టుకునేలా, వివిధ రకాల ప్రకటనలతో తమ దుకాణాలకు రప్పించుకునేలా జ్యుయలరీ దుకాణాల యజమానులు ప్రయత్నిస్తుంటారు. కార్పొరేట్ దుకాణాల నుంచి చిన్నస్థాయి దుకాణాల వరకూ రాయితీలను ప్రకటించడం అలవాటుగా మార్చుకున్నాయి. వినియోగదారులు ఒక్కసారి తమ దుకాణానికి అడుగు పెడితే వారిని శాశ్వతంగా తమ సభ్యులుగా చేర్చుకోవచ్చన్న వ్యూహాలతో ముందుకెళుతున్నాయి.
భారీగా పెరిగి...
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా ఒక్కసారిగా పెరిగాయి. ఎంతగా అంటే వెండి త్వరలోనే కిలో లక్ష రూపాయలకు చేరుకునేంతగా. పది గ్రాముల బంగారం ధరపై 170 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై 11 వందల రూపాయల వరకూ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 68,810 రూపాయలు పలుకుతుండగా, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 75,060 రూపాయలకు చేరుకుంది. ఇక కిలో వెండి ధర 93,100 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది.