Gold Price Today : గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గుతున్నాయి. కొనుగోలు చేయాలంటే ఇదే మంచి సమయం మిత్రమా
ఈరోజు దేశంలో బంగారం ధరల్లో కొద్దిగా తగ్గుదల కనిపించింది. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి
బంగారం కొనుగోలు చేయడానికి ఒక సమయం ఉండదు. జేబులో డబ్బులుంటే చాలు. ఎప్పుడైనా కొనుగోలు చేయొచ్చు. మనకు ఇష్టమైన ఆభరణాలను సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా మహిళలు అత్యంత ఎక్కువగా ఇష్టపడే బంగారం, వెండి ధరలు గత కొంత కాలంగా తగ్గుతూ వస్తున్నాయి. అందుకు కారణాలు అనేకం చెబుతున్నప్పటకీ కొనుగోలుదారులకు ఇది ఊరట కలిగించే విషయమే. రానున్న కాలంలో పసిడి, వెండి ధరలు మరింత పెరిగే అవకాశముందన్న హెచ్చరికలు వినపడుతున్న నేపథ్యంలో ధరలు తగ్గుదలతో కొనుగోళ్లు మరింత పెరుగుతాయని వ్యాపారులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అనేక కారణాలు...
గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే తగ్గుదల పెద్దగా లేదు. ధరలు స్వల్పంగా తగ్గుతున్నప్పటికీ పెరగకపోవడం చాలా వరకూ కొనుగోలుదారులను దుకాణాలకు రప్పించడం కోసమేనని అందరికీ తెలిసిందే. అయితే ధరల్లో మార్పు ఇక్కడి వారి చేతుల్లో ఉండదు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, డాలర్ తో రూపాయి విలువ వంటి కారణాలతో ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. అయితే ఈ తగ్గుదల ఉన్నప్పుడే బంగారం అవసరం ఉన్నవాళ్లు కొనుగోళ్లు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
ఈరోజు కూడా...
రానున్న కాలంలో సీజన్ ప్రారంభమయితే ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరల్లో కొద్దిగా తగ్గుదల కనిపించింది. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయల వరకూ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 68,490 రూపాయలు పలుకుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 74,720 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 95,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది. అయితే ఉదయం ఆరు గంటల వరకే ఈ ధరలన్నది కొనుగోలుదారులు గమనించాల్సి ఉంటుంది.