Gold And Silver Price Today : ఇంకా కొంచెం తగ్గాలమ్మా.. బంగారాన్ని కొనుక్కోవచ్చు
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది
దేశంలో బంగారం ధరలు మరింత ప్రియమయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు. డిమాండ్ పెరగడంతో పాటు దిగుమతులు తగ్గడం, బంగారం నిల్వలు కూడా తరిగిపోతుండటంతో దాని ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ధరలు పెరిగినప్పుడల్లా ఏదో ఒక కారణం చూపి వ్యాపారులు వాటికి మరింత జోడించి ఇంకా అదనపు ఛార్జీలను వినియోగదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అయినా కొనుగోళ్లు ఆగడం లేదు. ఎందుకంటే బంగారం విషయంలో నాణ్యత ఎంత ముఖ్యమో.. దానిని సొంతం చేసుకునేందుకు కూడా అలాగే ఇష్టపడుతుంటారు.
రానున్న రోజుల్లో...
బంగారం, వెండి ధరలు ఇక తగ్గే అవకాశాలు లేవు. రానున్నది మరింత సీజన్. ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు డిసెంబరు నెల వరకూ ముహూర్తాలున్నాయి. పెళ్లిళ్లు అధికంగా జరగనున్నాయి. ఇక శుభకార్యాలకు కూడా కొదవ ఉండదు. ఈ నేపథ్యంలో బంగారం, వెండికి మరింత డిమాండ్ పెరుగుతుంది. దీంతో వాటి ధరలు కూడా పెరుగుతాయన్న అంచనాలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొనుగోలు చేయదలచుకున్నవారు బంగారం, వెండిని ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వినపడుతున్నాయి. కానీ కొనుగోలు చేయాలంటే దానికి తగిన సమయం, అవసరం కూడా రావాల్సి ఉంటుంది కదా?
కొద్దిగా తగ్గి...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది. అయితే గత కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు ప్రస్తుతం తగ్గడం కొంత వినియోగదారులకు ఊరటనిచ్చే విషయమేనని చెప్పుకోవాలి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు, కిలో వెండి ధరపై వంద రూపాయలు ధర తగ్గింది. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66.640 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 74,880 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 91,900 రూపాయలుగా కొనసాగుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. పెరగొచ్చు. తగ్గొచ్చు. వెయిట్ చేయడం కంటే కొనుగోలు చేయడమే బెటర్.