Anil Ambani : అనిల్ అంబానీకి 25 కోట్లు జరిమానా

పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీకి సెబీ షాక్ ఇచ్చింది. ఐదేళ్లపాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది

Update: 2024-08-23 08:02 GMT

పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీకి సెబీ షాక్ ఇచ్చింది. ఐదేళ్లపాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు అనిల్ అంబానీకి ఇరవై ఐదు కోట్ల రూపాయల జరిమానాను విధించింది. రిలయన్స్ హోం ఫైనాన్స్ నిధులను దారి మళ్లించారని ఈ చర్యలకు దిగింది. అనిల్ అంబానీ సంస్థలతో  పాటూ మరో 24 సంస్థలపై కూడా నిషేధం విధించడం సంచనలంగా మారింది.

నిధులు మళ్లించారని...
నిధులను మళ్లించినందునే ఈ చర్యలకు దిగినట్లు సెబీ తెలిపింది. ఈ ఐదేళ్లపాటు సెక్యూరిటీ మార్కెట్లతో సంబంధం ఉండే ఎటువంటి కార్యక్రమాల్లో పొల్గొన కూడదని పేరుకొంది . రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ పై మాత్రం ఆరేళ్ల పాటు నిషేధం విధించడమేకాకుండా ఆరు లక్షల రూపాయల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.


Tags:    

Similar News