నితిన్‌ గడ్కరీ వ్యాఖ్యలపై టాటా ఎండీ కీలక ప్రకటన

గత నాలుగైదు రోజుల కిందట కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ డీజిల్‌ వాహనాలపై కీలక ప్రకటన ఇచ్చారు. అయితే..

Update: 2023-09-17 05:22 GMT

గత నాలుగైదు రోజుల కిందట కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ డీజిల్‌ వాహనాలపై కీలక ప్రకటన ఇచ్చారు. అయితే దేశంలో డీజిల్‌ కార్లపై 10 శాతం జీఎస్టీ విధించనున్నారనే వార్తలు వైరల్‌ అవుతున్న నేపథ్యంలో నితిన్‌ గడ్కరీ క్లారిటీ ఇచ్చారు. డీజిల్‌ వాహనాల విక్రయాలపై కేంద్రం 10 శాతం వరకు ట్యాక్స్‌ విధింపుపై కేంద్రం పరిశీలనలో లేదని, దీనిపై తాను క్లారిటీ ఇచ్చేందుకే మీడియా ముందుకు రావాల్సివచ్చిందని చెబుతూనే వాహనాల కంపెనీలకు సుతిమెత్తని షాకిచ్చారు. రాబోయే రోజుల్లో టాటాతో పాటు ఇతర వాహనాల కంపెనీలు డీజిల్‌తో తయారు చేసే వాహనాలను నుంచి కాలుష్యం తీవ్ర స్థాయిలోవెలువడుతోందని, డీజిల్‌ వాహనాలను నిలిపివేయాలని కోరారు. అంతేకాకుండా డీజిల్‌ వాహనాల ఉత్పత్తిని నిలిపివేయకుంటే 10 శాతం జీఎస్టీ విధించే విధంగా కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌తో మాట్లాడాతానని అన్నారు. కంపెనీలకు అదనపు ట్యాక్స్‌ పెంచినట్లయితే కంపెనీలు తీవ్ర భారం మోయాల్సి వస్తుందని, అందుకే కాలుష్యం వెదజల్లే అన్ని డీజిల్‌ వాహనాల ఉత్పత్తిని నిలిపివేయాలని కోరుతున్నానని అన్నారు. అయితే ఈ అంశంపై నితిన్ గడ్కరీ చేసిన ప్రకటనపై టాటా ఎండీ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంతకు టాటా ఎండీ ఎమన్నారంటే..

ఇదిలా ఉండగా, మంత్రి నితిన్‌ గడ్కరీ చేసిన ప్రకటనపై టాటా శైలేష్‌ చంద్ర స్పందించారు. టాటామోటార్స్ లిమిటెడ్ తన ప్రస్తుత మోడళ్లైన ఆల్టోజ్, హారియర్, సఫారీ, ఫేస్‌లిఫ్టెడ్ నెక్సాన్ వంటి డీజిల్ ఆధారిత వేరియంట్‌లను మార్కెట్ డైనమిక్స్, రెగ్యులేషన్స్ అనుమతి ఉన్నంత వరకు ఉత్పత్తిని కొనసాగిస్తామని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో డీజిల్‌ వాహనాల ఉత్పత్తిని నిలిపివేయాలని, దీని వల్ల కాలుష్యాన్ని నివారించేందుకు దోహదపడుతుందని గడ్కరీ అన్నారని, కానీ మార్కెట్లో డిమాండ్‌ ఉన్నంత వరకు ఈ డీజిల్‌ వాహనాలను కొనసాగిస్తామని, 2040 వరకు ఈ డీజిల్‌ వాహనాలను పూర్తిగా నిలిపివేసే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు.
ఎలక్ట్రిక్‌ వాహనాల పనులు వేగవంతం..
కాగా,మార్కెట్లో ఎలక్ట్రిక్‌ వాహనాలను తీసుకువచ్చేందుకు పనులు వేగవంతం చేస్తామని అన్నారు. అదే సమయంలో వేలాది మంది ప్రజలు డీజిల్ ఇంజిన్ మోడల్‌లను కోరుకుంటారని, అందుకే OEM (ఒరిజినల్‌ ఇక్యూమెంట్‌ మ్యానిఫ్యాక్షర్‌) అసలైన పరికరాల తయారీదారుగా మా విధానం కొనసాగించేందుకు సులభతరం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మార్కెట్, నిబంధనలకు అనుగుణంగానే కొనసాగుతామని స్పష్టం చేశారు. డిమాండ్ ఉన్నంత వరకు డీజిల్ వాహనాల తయారీని కొనసాగిస్తాము అని టాటా ఎండీ స్పష్టం చేశారు.
Tags:    

Similar News