బీఎస్‌ఎన్ఎల్‌ నుంచి అదిరిపోయే ప్లాన్స్‌.. తక్కువ ధరల్లో ఎక్కువ రోజులు!

జూలై 3వ తేదీ నుంచి జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియాలు తమ టారీఫ్‌ ప్లాన్‌ ధరలను ఒక్కసారిగా

Update: 2024-07-08 05:05 GMT

BSNL

జూలై 3వ తేదీ నుంచి జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియాలు తమ టారీఫ్‌ ప్లాన్‌ ధరలను ఒక్కసారిగా పెంచేశాయి. రీఛార్జ్‌ ధరలు భారీగా పెంచడంతో వినియోగదారులకు భారంగా మారిపోయింది. అయితే ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ అయిన బీఎస్‌ఎన్ఎల్‌ మాత్రం ఎలాంటి టారీఫ్‌ ప్లాన్‌లను పెంచలేదు. అంతేకాకుండా కస్టమర్లకు చౌకైన ప్లాన్‌లను అందిస్తోంది. వినియోగదారులను మరింతగా ఆకర్షించేందుకు సరికొత్త ప్లాన్‌లతో ముందుకొస్తోంది బీఎస్‌ఎన్‌ఎల్‌. అతి తక్కువ ధరల్లో ఎక్కువ వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్‌లను తీసుకువస్తోంది. ఇతర నెట్‌వర్క్‌ కంపెనీలకంటే బీఎస్‌ఎన్‌ఎల్‌ తక్కువ ధరల్లో ఎక్కువ వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్‌ను ప్రవేశపెడుతోంది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ ప్లాన్‌లో కంటిన్యూగా ఉండకపోవచ్చు. ఆఫర్లలో భాగంగా ఉన్న ఈ ప్లాన్‌లలో మార్పులు కూడా ఉండవచ్చని గమనించండి.

రూ.107 ప్లాన్:

బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైన ప్లాన్‌లలో రూ.107 ఒకటి. దీని వాలిడిటీ 35 రోజులు. ఇది 3జీబీ 4G డేటాను అందిస్తుంది. అదనంగా 200 నిమిషాల ఉచిత వాయిస్ కాల్స్ కూడా అందిస్తోంది.

రూ.197 ప్లాన్:

ఈ ప్లాన్‌లో మీరు 70 రోజుల పాటు చెల్లుబాటును అందుకోవచ్చు. ఇందులో మీకు 2జీబీ 4జీ డేటా లభిస్తుంది. మొదటి 18 రోజుల పాటు అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉంటాయి. రూ.199 రీఛార్జ్ చేసుకుంటే 70 రోజుల పాటు అపరిమిత కాలింగ్ సౌకర్యం లభిస్తుంది.

రూ. 397 ప్లాన్‌:

ఇక 150 రోజుల వ్యాలిడిటీతో అందించే ప్లాన్‌లలో ఇదొకటి. ఇది మొదటి 30 రోజులకు 2జీబీ 4G డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తుంది. వ్యాలిడిటీ ఎక్కువ రోజులు ఉండాలనుకునేవారికి ఈ ప్లాన్‌ బాగుంటుంది.

రూ.797 ప్లాన్‌:

రూ.797 రీఛార్జ్‌ చేసుకుంటే 300 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇది మొదటి 60 రోజులకు 2GB 4G డేటాను అందిస్తుంది.

1999 రూ ప్లాన్:

ఈ ప్లాన్‌లోఒక సంవత్సరం వ్యాలిడిటీ పొందవచ్చు. ఇది అపరిమిత కాలింగ్, 600జీబీ 4G డేటాను అందిస్తుంది. ఈ రీఛార్జ్ కాకుండా బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్‌తో సహా ఇతరప్రయోజనాలు కూడా ఉన్నాయి.

Tags:    

Similar News