Gold Price Today : క్రిస్మస్ కు అదిరిపోయే న్యూస్.. బంగారం ధరలు ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారంతే

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది

Update: 2024-12-25 03:39 GMT

బంగారం ధరలు మరింత ఎక్కువవుతాయని అంటున్న వారికి గత రెండు రోజుల నుంచి వరసగా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇది గోల్డ్ లవర్స్ కు ఆనందమైన వార్తే. అయితే ప్రపంచ వ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు పడిపోవడంతోనే ధరలు పతనమయ్యాయన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేని విధంగా ధరలు పైపైకి వెళ్లడంతో ఇక కొనుగోలు చేయడం కష్టమేనని భావించారు. కానీ అలాంటి వారికి ధరలు దిగిరావడం ఒకరకంగా మంచిదే. ధరలు కొంత దిగిరావడంతో మన దేశంలో కూడా కొనుగోళ్లు పెరుగుతాయని వ్యాపారులు భావిస్తున్నారు.

కొనుగోళ్లు తగ్గడంతో...
ఇప్పటి వరకూ తెచ్చిన ఆభరణాలు, వివిధ రకాల డిజైన్లు అమ్ముడు పోకుండా షోరూంలకే పరిమితమవ్వడంతో వ్యాపారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. షోరూంల నిర్వహణ కూడా కష్టంగా మారింది. అదేమంటే కనీసం కొన్ని షాపులకు కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. అదే సమయంలో భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నప్పటికీ వినియోగదారులు దుకాణాల మెట్లు ఎక్కడం లేదు. దీంతో మరికొన్ని రాయితీలను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి దుకాణాల యాజమాన్యం. కొత్త ఏడాది ప్రారంభం నుంచి కొనుగోళ్లు ఊపందుకుంటాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. మార్కెట్ నిపుణులు కూడా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని తెలిపారు.
స్వల్పంగా తగ్గినా...
గత రెండు రోజులుగా వరసగా బంగారం ధరలు తగ్గుతూ కొంత పసిడి ప్రియులకు ఊరటనిస్తున్నాయి. అందులోనూ నేడు క్రిస్మస్ పర్వదినం కావడంతో ధరలు తగ్గి మరింతగా కస్టమర్లను ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. ఇదే విధంగా మరికొంత ధరలు తగ్గాలని పెట్టుబడి పెట్టే వారు కోరుకుంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 70,890 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,340 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 98,800 రూపాయలుగా ట్రెండ్ అయింది.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now


 

Tags:    

Similar News