Gold Price Today : వారెవ్వా శుక్రవారం.. మహిళలకు ఎంత మంచి కబురు..భారీగా తగ్గిన బంగారం ధరలు

ఈరోజు దేశంలో భారీగా బంగారం ధరలు తగ్గాయి. అదే స్థాయిలో వెండి ధరలు కూడా పతనమయ్యాయి

Update: 2024-12-20 02:51 GMT

శుక్రవారం మహిళలకు సెంటిమెంట్.ఎందుకంటే మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తుంటారు. అందుకే ఈరోజు బంగారం ధరలు కూడా భారీగా తగ్గినట్లు కనిపించడంతో మహిళలకు ఒకరకంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇటీవల కాలంలో వరసగా బంగారం,ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ధరలు అందుబాటులో లేనంతగా పెరిగిపోతున్నాయి. అస్సలు బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయగలమా? అన్న సందేహం కూడా మహిళలు అనేకమంది ఇబ్బంది పడి పోతున్నారు. ఆ మధ్య కొద్దిగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు తర్వాత క్రమంగా వేగంగా పెరగడం ప్రారంభించడంతో ఇక ధరలు ఆగేటట్లు లేవని అందరూ భావించారు. వ్యాపారులు కూడా అదే చెబుతున్నారు.

విదేశాల్లో కొనుగోళ్లు...
మరోవైపు బంగారం, వెండి విషయంలో మహిళలు మాత్రమే కాదు ఇప్పుడు అందరూ కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుండటంతో వాటికి డిమాండ్ మరింత పెరుగుతూ వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలకు గిరాకీ ఏమాత్రం తగ్గడం లేదు. కొనుగోళ్లు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. ఎందుకంటే బంగారం పై పెట్టుబడికి ఎక్కువ మంది మొగ్గు చూపడమే ఇందుకు కారణమని చెప్పాలి. సురక్షితంగా ఉండటమే కాకుండా గ్యారంటీ రాబడి అని భావించి గోల్డ్ ను కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. విదేశాల్లోనూ ఇటీవల కాలంలో బంగారం కొనుగోళ్లు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
భారీగా తగ్గి...
అయితే బంగారం ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేయాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా తగ్గుతాయని భావించి వెయిట్ చేయడం మూర్ఖత్వమని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈరోజు దేశంలో భారీగా బంగారం ధరలు తగ్గాయి. అదే స్థాయిలో వెండి ధరలు కూడా పతనమయ్యాయి. పది గ్రాముల బంగారం ధరపై 650 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వెయ్యి రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 70,690 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,120 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 98,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News