Gold Price Today : బంగారం కొనుగోలు చేసే వారికి నేడు శుభదినమే.. ఎందుకంటే ధరలు ఇలా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి
బంగారం ధరలు నిత్యం పెరుగుతూ ఉంటాయి. వాటికి హద్దు అదుపు ఉండదు. కొనుగోలు చేయడానికి వీలవుతుందా? అన్న ఆలోచనలో లేనట్లు ధరలు పెరుగుతుంటాయి. కానీ బంగారం, వెండి ధరలు పెరగడం అంటే ఎవరి చేతుల్లో ఉండదు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు వంటి కారణాలతో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. అందుకే ప్రతి రోజూ ధరలు పెరుగుతున్నా, కొంచెం తగ్గుతున్నా ఎవరిని తప్పు పట్టడానికి కూడా లేదు. డిమాండ్ ను బట్టి ధరలు పెరుగుతూనే ఉంటాయి. అందులో బంగారం కొనుగోలు చేసే వారు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇక ధరలు భవిష్యత్ లోనూ తగ్గుతాయని చెప్పలేం.
డిమాండ్ తగ్గని...
భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి బంగారం, వెండికి డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఈ రోజుల్లో ఎక్కువగా ఉండటం కూడా కొనుగోళ్లు అధికంగా జరుగుతున్నాయి. కొనుగోళ్లు ఎక్కువగా ఉన్నప్పడు సరిపడనంత సరుకు లేనప్పుడు ఎప్పుడైనా, ఏ వస్తువైనా ధరలు పెరగాల్సిందే. బంగారానికి నిత్యం డిమాండ్ పెరగడమే తప్ప తగ్గడం అంటూ ఉండదు. ఒకవేళ తగ్గినా స్వల్పంగానే తగ్గుతుంది తప్ప తాము ఆశించిన స్థాయిలో బంగారం ధరలు దిగిరావన్నది అందరికీ తెలుసు. ఇక దేశ వ్యాప్తంగా ఈ సీజన్ లో రెండు లక్షలకు పైగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. పెళ్లిళ్లలో బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడం సంప్రదాయంగా రావడం కూడా వ్యాపారులకు కలసి వస్తుంది.
వెండి స్వల్పంగా...
మరోవైపు దేశంలో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నప్పటికీ కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదని, వచ్చే నెల నుంచి ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త ఏడాదిలో అనేక రకాల పరిణామాల ప్రభావం బంగారంపై పడుతుందని కూడా చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర పై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 70,990 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,440 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 99,800 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.