Gold Price Today : బంగారాన్ని ఎప్పుడు కొనుగోలు చేయొచ్చంటే..నిపుణుల మాట ఇదీ

దేశంలో ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి

Update: 2024-10-20 03:23 GMT

బంగారం అనేది అందరూ ముచ్చటపడి కొనుగోలు చేసే వస్తువు. అది మహిళలకు ఒక డ్రీమ్ వంటిది. బంగారం ఉంటే చాలు.. కనీసం తిండితిప్పలు లేకపోయినా బతికేసేంతగా వారి ఉత్సాహం బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఉంటుంది. బంగారం కొనుగోలు చేసే సమయంలో వారి ముఖంలో కనిపించే ఆనందం జీవితంలో మరే దశలోనూ కనిపించవన్న జోకులు కూడా పేలుతుంటాయి. అంతగా మహిళలు గోల్డ్ కు కనెక్ట్ అయిపోయారు. అలాంటి బంగారం, వెండి ధరలు అందకుండా పోతుండటంతో మహిళలు నీరస పడిపోయారు. జ్యుయలరీ దుకాణాలకు వెళ్లాలంటనేనే జంకే పరిస్థితి ఏర్పడింది. అందుకే బంగారం కొనుగోళ్లకు ఒక సమయం ఉంటుందని చెబుతున్నారు.

ఎప్పుడు కొనుగోలు చేయాలంటే?
బంగారాన్ని ఎప్పుడు పడితే అప్పుడు కొనుగోలు చేయకూడదట. ముఖ్యంగా సీజన్ సమయంలో అస్సలు అటు వైపు చూడకూడదట. ఇక ధరలు పెరుగుతున్న సమయంలో కొనుగోళ్లకు దూరంగా ఉండటం మేలని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే సీజన్ లో పెరిగిన బంగారం, వెండి ధరలు నిలకడగా ఉండవు. ఎంత వేగంగా ధరలు పెరిగాయో అంతే స్థాయిలో తగ్గే అవకాశం కూడా లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. అందుకే అవసరం ఉన్న వారు కొనుగోలు చేయవచ్చు కానీ, పెట్టుబడులుగా, తమ వ్యక్తిగత అవసరాల కోసం కొనుగోలు చేసే వారు మాత్రం ధరలు పెరిగే సమయంలో మాత్రం వేచి ఉండటం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి.
మళ్లీ పెరిగి...
ఇప్పుడు అదే జరుగుతుంది. బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. సీజన్ దగ్గరపడుతుండటంతో ధరలు వేగంగా పెరుగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర ఎనభై వేలకు చేరుకుందంటే ఇక దానిని ముట్టుకుంటే షాక్ తగిలేలా ఉంది. అందుకే సీజన్ ముగిసిన తర్వాత కొనుగోలు మంచిదన్నది నిపుణుల అభిప్రాయం. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. దేశంలో ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. పది గ్రాముల బంగారం ధరపై 430 రూపాయలకు పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,800 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 79,420 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధరల 1,07,000 రూపాయలకు చేరింది



Tags:    

Similar News